గుంటూరు

రైతుల శ్రేయస్సే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, డిసెంబర్ 11: వ్యవసాయం ప్రధానంగా ఉన్న భారతదేశంలోని వ్యవసాయ స్థితిగతులను తెలుసుకుని, చీడ, పీడ బెడద లేకుండా చేసేందుకు తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక మందులను తయారు చేసి రైతులకు సాయపడేందుకు నార్త్ అమెరికా, బ్రెజిల్ దేశాల నుండి విచ్చేసిన శాస్తవ్రేత్తలమైన తమకు ఇక్కడి రైతులు సాదర ఆహ్వానం పలకడం హర్షదాయకమని పొన్నూరులో సోమవారం రాత్రి జరిగిన విలేఖర్ల సమావేశంలో శాస్తవ్రేత్తల బృందం వెల్లడించింది. పొన్నూరు, చెరుకుపల్లి ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడి రైతాంగ సమస్యలను తాము తెలుసుకున్నామన్నారు. ఇక్కడి రైతులకు తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక మందులను తయారు చేయించి ఆదాము ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా రైతులకు అందజేస్తామని నార్త్ అమెరికాకు చెందిన శాస్తవ్రేత్త రాబర్ట్ విలియమ్స్ వెల్లడించారు. తక్కువ ఖర్చుతో తమ కంపెనీ ద్వారా క్రిమి సంహారక మందులు తయారు చేసి రైతులకు అందజేయడమే తమ ధ్యేయమన్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదాము ఇండియా కంపెనీ ద్వారా అందిస్తున్న సేవల వలన ఎనిమిదేళ్లకే మంచి ఫలితాలు సాధించామన్నారు. ఈ సమావేశంలో కంపెనీ అకౌంట్ లీడర్ కెల్విన్ జోర్డాన్, కంపెనీ నేషనల్ ప్రతినిధి మైత్రికుమార్, ప్రసాద్ నాయక్, బాలాజీ ప్రసాద్, జ్యోతికుమార్, లాం శాస్తవ్రేత్త సుబ్బరామిరెడ్డి, కంపెనీ డీలర్లు ఆనంద్, నన్నపనేని రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

బీసీల అభివృద్ధికి కట్టుబడిన ప్రభుత్వం
క్రోసూరు, డిసెంబర్ 11: వెనుకబడిన తరగతుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీ్ధర్ అన్నారు. సోమవారం సర్పంచ్ లీలావతి గృహప్రవేశానికి హాజరైన కొమ్మాలపాటి బీసిలకు తెలుగుదేశం పార్టీ హయాంలో కులాల వారీగా లోన్లు మంజూరు చేస్తున్నామని, వారి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని, కాపుల వలన బీసిలకు ఎలాంటి లోటు ఏర్పడదని వెల్లడించారు. క్రోసూరులో పలు కులవృత్తుల వారిని కలిసి వారి వృత్తి సంబంధ విషయాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను, లావాదేవీల గురించి ఆరాతీశారు. రజకులకు ఇస్ర్తిబండి లోనులను నియోజకవర్గం తరపున మంజూరు చేస్తున్నామని, కల్లుగీత కార్మికులు, నాయిబ్రాహ్మణులకు, యాదవులకు కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ చిలకా లీలావతి, జెడ్పీటీసీ విల్సన్ గ్లోరి, ఎంపీపీ వల్లాల సుభాషిణి, యార్డు ఛైర్మన్ ఏపూరి నాగేశ్వరరావు, మాజీ ఛైర్మన్ కాండ్రు కాశియ్య, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు నలజాల సదాశివరావు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసగౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.