గుంటూరు

పేదల ఇళ్ల నిర్మాణంలో జాప్యం ఇంకెన్నాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, డిసెంబర్ 14: సొంతిల్లు లేని పేదలకు ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభంకాక నెలలు గడిచి పోతున్నాయని జాప్యం ఇంకెన్నాళ్లని గురువారం నాడిక్కడ జరిగిన మంగళగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాలక ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. సమావేశానికి మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభం కాగానే సొంత ఇంటికోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు ఆధార్ లింకు చేయడం కష్టంగా మారిందని, ఏ కారణం చేతనో దరఖాస్తులకు ఆధార్ లింకు కావడంలేదని, మొదటి జాబితాలో ఉన్న పేర్లు రెండోజాబితాలో కన్పించడం లేదని సభ్యులు ఉడతా శ్రీను, మునగపాటి వెంకటేశ్వరరావు, జవహర్‌లాల్ తదితరులు పేర్కొన్నారు. దరఖాస్తులు జియో ట్యాగింగ్ చేసే పని టిడ్కో ద్వారా సాగుతోందని మున్సిపల్ కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావు అన్నారు. మొదటి 2592 మంది పేదలకు జాబితా సిద్ధం చేస్తే రాష్ట్ర మంత్రులతో సంతకాలు చేయించి పనులు ప్రారంభిద్దామని చైర్మన్ చిరంజీవి అన్నారు. జాబితాలు వచ్చాక అర్హులెవరికీ అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ నాగేశ్వరరావు బదులిచ్చారు. పట్టణంలో పురపాలక సంఘానికి చెందిన ఆస్తులు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించు కోవడం లేదని, గడిచిన మూడేళ్లుగా మున్సిపల్ ఆస్తుల జాబితా ఇవ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని బట్టు చిదానంద శాస్ర్తీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే మున్సిపల్ ఆస్తులు గుర్తించి స్థలాల వద్ద బోర్డులు పెడతామని, బావిపూడ్చి స్థలం కబ్జాచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, టిపిఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. పురసేవ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని, 28 రకాల సేవలు ఈ యాప్ ద్వారా పొందవచ్చని, 92 రకాల ఫిర్యాదులు చేయవచ్చని మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు అన్నారు. కాంట్రాక్టర్లకు చెక్కులు ఇచ్చినా ట్రెజరీలో ఆంక్షలు ఉన్నందున మారటం లేదని, దీంతో డబ్బు కొరత ఏర్పడి కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించడం లేదని డీఈఈ ఏడుకొండలు అన్నారు. పట్టణంలో గౌతమబుద్ధ రోడ్డుకు ఇరువైపులా డివైడర్ మధ్యలోను లక్షలాది రూపాయలు వెచ్చించి మొక్కలు నాటినా నీరుపోసే నాధుడు లేక ఎండి పోతున్నాయని పలువురు సభ్యులు పేర్కొన్నారు. గౌతమబుద్ధ రోడ్డులో ఇటీవల వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయని, ఎప్పటినుంచో రోడ్డు విస్తరణ జరుగుతుందని చెబుతున్నారని సభ్యులు పేర్కొనగా ఈ విషయాన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు దృష్టికి తీసుకెళ్లామని, జనవరిలో నిధులు సమకూరే అవకాశం ఉందని చైర్మన్ చిరంజీవి వెల్లడించారు. పట్టణ శివారులోని ఓవర్ బ్రిడ్జిపై విద్యుదీకరణ పనులు ఆరు నెలలుగా ముందడుగు పడలేదని, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని సిపిఎం సభ్యులు విమర్శించారు. కుప్పురావు కాలనీలో 150కి పైగా పందులు సంచరిస్తున్నాయని బట్టు చిదానంద శాస్ర్తీ అన్నారు.