గుంటూరు

ఇళ్ల నిర్మాణంలో జాప్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 14: ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు కోటప్పకొండను సందర్శించనున్నారు. ఎకోటూరిజం అభివృద్ధిలో భాగంగా కోటప్పకొండను తీర్చిదిద్దడంతో పాటు రోప్‌వే నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతోపాటు సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గురువారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు నియోజకవర్గాల్లో గృహనిర్మాణాల్లో జరుగుతున్న జాప్యాన్ని గుర్తించిన స్పీకర్ అధికారులపై ఒకింత ఆగ్రహం వ్యక్తంచేశారు. సాంకేతిక పరమైన ఇబ్బందులు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని కోడెల శివప్రసాదరావు అన్నారు. సత్తెనపల్లిలో స్టేడియం నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. స్టేడియంలో లెవలింగ్, కాంపౌండ్ వాల్ పనులను పూర్తిచేసి అభివృద్ధికి టెండర్లు పిలిచి వచ్చే డిసెంబర్ నాటికి అన్ని విధాలా అభివృద్ధిపర్చాలన్నారు. సత్తెనపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా షాపులు కోల్పోయిన వారికి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, చెరువు, వావిలాల ఘాట్ అభివృద్ధి, పట్టణ పేదలకు గృహ నిర్మాణం, కోల్డ్‌స్టోరేజ్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులపై జ్లి పరిషత్, మున్సిపల్, మార్కెటింగ్, పంచాయతీరాజ్ అధికారులతో చర్చించారు. పట్టణంలో కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటుకు సంబంధించి జెడ్పీ ఛైర్‌పర్సన్ జానీమూన్, సిఇఒ ఇతర అధికారులతో మాట్లాడారు. పట్టణంలోని గుంటూరు రోడ్డులో ఉన్న జెడ్పీ స్థలంలో కోల్డ్‌స్టోరేజ్ నిర్మిస్తే జిల్లా పరిషత్‌కు ఆదాయంతో పాటు ల్యాండ్ కబ్జాలకు గురికాకుండా ఉంటుందని స్పీకర్ అన్నారు. టూరిజం అభివృద్ధిపై స్పీకర్ కోడెల ఎండి హిమాన్షు శుక్లా, ఇడి మల్లిఖార్జున్, అటవీశాఖ అధికారి మోహన్ ఇతర అధికారులతో సమీక్షించారు. 26న కోటప్పకొండను సీఎం రానున్న నేపథ్యంలో 25లోపు అభివృద్ధి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. రోప్‌వే, ఏకోటూరిజం, చిల్డ్రన్‌పార్క్, గ్రీనరి, ఆడిటోరియం ఇలా ప్రతిదానిలోనూ ప్రత్యేకత చాటాలన్నారు. ఈ సందర్భంగా విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన స్పీకర్ కోడెలకు నాయకులు, అధికారులు అభినందనలు తెలిపారు.