గుంటూరు

అధికారుల నిర్లక్ష్యంతో కుంటుపడుతున్న అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, డిసెంబర్ 16: నిధులున్నా అధికారుల నిర్లక్ష్యం వలన మండల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని శనివారం నాడిక్కడ జరిగిన మంగళగిరి మండల పరిషత్ సాధారణ సమావేశంలో పలువురు సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమావేశానికి ఎంపిపి పచ్చల రత్నకుమారి అధ్యక్షత వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంపై అన్ని పక్షాల సభ్యులు నిరసన వ్యక్తంచేశారు. మండలంలో నిధులు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొందని, గత ఎంపిడిఓ పద్మావతి వర్క్ ఆర్డర్లు ఇవ్వని ఫలితంగా పనులు నిలిచి పోయాయని ఉపాధ్యక్షుడు ఎం పకీరయ్య, వైసీపీ సభ్యుడు ఎం శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని పలు గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా పేర్కొంటూ మాట్లాడిన ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈపై పకీరయ్య విరుచుకుపడ్డారు. పోరంబోకు స్థలాల్లో ఇళ్లకు మరుగుదొడ్డి ఇవ్వడం కుదరదని, వారికోసం సులభ కాంప్లెక్స్‌లు నిర్మిస్తామని ఏఈ పేర్కొనగా వాటివల్ల ఉపయోగం ఉండదని పకీరయ్య అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్య తీసుకెళ్తామని ఏఈ పేర్కొన్నారు. 2016కు పూర్వం తీర్మానం చేసిన పనులకు కూడా వర్క్ ఆర్డరు ఇవ్వకపోవడంతో నిలిచి పోయాయని పకీరయ్య, శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కాజ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్ర నిర్మాణానికి స్థలం ఇచ్చి ఏడాది గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఈదా ప్రతాపరెడ్డి ప్రశ్నించగా మరో మూడు గ్రామాల నుంచి స్థలం కేటాయింపు జరగనందున నిలిచి పోయిందని ఏఈ పేర్కొన్నారు. తమ గ్రామంలో రోడ్డు నిర్మిస్తున్నా కాంట్రాక్టర్‌ను తాను ఎప్పుడూ చూడలేదని, అధికారులే అంతా నడిపిస్తున్నారని, ఆయన పేరైనా చెప్పండని నవులూరు సర్పంచ్ బాణావత్ బాలాజీనాయక్ ప్రశ్నించారు. కాంట్రాక్టర్ తప్పనిరిగా కలుస్తాడని, ఆ రోడ్ల తాలూకా బిల్లు సర్పంచ్ పేరునే వస్తుందని ఏఈ శ్రీనివాసరావు బదులిచ్చారు. మండల పరిధిలోని గ్రామాల్లో రేషన్‌కార్డులు లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు కూడా ఇవ్వాలని, ఇప్పటి వరకు 2300 దరఖాస్తులు వచ్చాయని తహశీల్దార్ వసంతబాబు పేర్కొన్నారు. జడ్‌పిటిసి సభ్యురాలు ఆకుల జయసత్య, ఎంపిడిఓ సిహెచ్ సువార్త, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రెండున్నర లక్షల మందికి చంద్రన్న క్రిస్మస్ కానుక

గుంటూరు, డిసెంబర్ 16: క్రిస్మస్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 2.50 లక్షల మంది తెల్లరేషన్‌కార్డుదారులకు చంద్రన్న క్రిస్మస్ కానుక కింద ఆరు రకాల సరుకులను అందించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ క్రితికా శుక్లా తెలిపారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో ఉన్న చంద్రన్న కానుక సరుకుల తూకం, నాణ్యతను స్వయంగా పరిశీలించారు. స్టాకు వివరాలు, పంపిణీ చేసే విధానం గురించి వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విలేఖర్లతో జేసీ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన చంద్రన్న కానుక సరుకులను ఈనెల 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు జిల్లాలోని చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అరకిలో బెల్లం, కిలో గోధుమపిండి, అరకిలో కందిపప్పు, అరకిలో శనగపప్పు, 100 గ్రాముల నెయ్యి, అరలీటరు పామాయిల్ అందిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు. 2018 జనవరి 1వ తేదీ నుండి చంద్రన్న సంక్రాంతి కానుక కింద సరుకులు కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సరుకుల నాణ్యతలో గానీ, తూకంలో గానీ లోపాలున్నట్లు తెలిస్తే తక్షణమే జిల్లా అధికారులకు గానీ, టోల్ ఫ్రీ 1100 నెంబర్‌కు గానీ ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. లోపాలున్నట్లు తేలితే అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సరుకులు పంపిణీ చేసే సమయంలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా చూస్తామన్నారు. అనంతరం ఇటీవల ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద సుమారు 10 లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన తూకపు యంత్రాన్ని జెసి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చిట్టిబాబు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.