గుంటూరు

ధనుర్మాసోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 16: ఆదిత్యుడు ధను రాశిలోకి ప్రవేశించడంతో శనివారం ఉదయం 11 గంటలకు ధనుర్మాసం ప్రారంభం కాగా, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని నలుమూలలా ఉన్న విష్ణు మందిరాలు, పావన శ్రీ గోదా రంగనాధులు కొలువైయున్న ఆలయాల్లో ధనుర్మాసోత్సవాన్ని వైభవంగా శనివారం ప్రభాతవేళలో, సుప్రభాతసేవతో అర్చకస్వాములు వైఖానస, పాంచరాత్ర ఆగమ సంప్రదాయానికి అనుగుణంగా ప్రారంభించారు. రోజుకొక్కటిచొప్పున 30 రోజుల పాటు 30 పాశురాలను గోదాదేవి ఆండాళ్ తల్లి రచించి శ్రీకృష్ణ భగవానుని ముంగిటగానం చేసి చరితార్ధురాలైనారు. ఆర్ అగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మీసమేత లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధి, పాతగుంటూరులోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానం, బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గోరంట్ల వెంకన్న సన్నిధి, ఆర్ అగ్రహారంలోని శ్రీనివాసుని దేవస్థానం, కృష్ణనగర్‌లోని శ్రీ లక్ష్మీనారాయణ మందిరం, అదే ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఎన్జీవో కాలనీ వేణుగోపాలస్వామి దేవాలయం, ఎస్‌టిఎన్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి సన్నిదానంతో పాటు నల్లపాడు, పొత్తూరు, బుడంపాడులలో గల విష్ణు మందిరాల్లో ధనుర్మాస సేవలు ప్రారంభమైనాయి. కృష్ణనగర్ లక్ష్మీనారాయణ మందిరంలో ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ ధనకుధరం సీతారామానుజాచార్య స్వామి, శ్రీమాన్ సత్యధర్మాచార్యులు శ్రీ గోదారంగనాధులకు విశేష కైంకర్యాలు చేశారు. బృందావన గార్డెన్స్ అన్నమయ్య కళావేదికపై జి కూర్మనాధస్వామి ప్రథమ తిరుప్పావై ప్రవచనం చేశారు.

వాలీబాల్ జట్టుకు విజ్ఞాన్ విద్యార్థులు

చేబ్రోలు, డిసెంబర్ 16: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్శిటీలో రెండు రోజుల పాటు జరిగిన దక్షిణ భారతదేశ అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ పోటీలు శనివారంతో ముగిశాయి. జెఎన్‌టియు పరిధిలోని 224 కళాశాలల నుంచి విద్యార్థులు రాగా 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులను విజ్ఞాన్ యూనివర్శిటీ నుంచి ఎంపిక చేశారు. వీరు జెఎన్‌టియు కాకినాడ తరపున సౌత్‌జోన్ అంతర్ యూనివర్శిటీల స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ అంతర్ విశ్వవిద్యాలయాల పోటీల్లో సత్తాచాటి విజయం సాధించి తిరిగి రావాలని ఆకాంక్షించారు. జెఎన్‌టియు కాకినాడ వాలీబాల్ జట్టుకు మొత్తం 12 మంది విద్యార్థులకు ఎంపిక చేయగా ఓడల రేవుకు చెందిన బిబిసి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బి సాయివెంకట రమణ, విశాఖపట్నం ఎస్‌ఎస్‌ఆర్ ఐటి కళాశాలకు చెందిన ఎం రాము నాయక్‌తో పాటు మరికొందరు విద్యార్థులు ఎంపికయ్యారు.