గుంటూరు

ఎడ్ల బండలాగుడు పోటీలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, జనవరి 18: ఎన్‌టిఆర్ వర్ధంతిని పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలు 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుగుతాయని ఫౌండేషన్ ఛైర్మన్ పేర్ని వీరనారాయణ తెలిపారు. టీడీపీ నేత రాయపాటి రంగారావు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి చిలకలూరిపేట ప్రాంతంలో ఈ పోటీలు నిర్వహించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పేరు ప్రఖ్యాతలు సాధించారని, మూడవ సంవత్సరం కూడా పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తొలుత ఎన్‌టిఆర్ విగ్రమానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యార్డు ఛైర్మన్ విడదల లక్ష్మీనారాయణ, ఛైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్

చిలకలూరిపేట, జనవరి 18: తెలుగుప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయిన తెలుగుజాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు అని రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం ఎన్‌టిఆర్ వర్ధంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు అనగానే గుర్తొచ్చేది అన్న ఎన్టీఆర్ అని, అటువంటి యుగపురుషుడు మరొకరు లేరన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువచ్చి, పేద, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతిగా నిలిచి ఆదుకున్న మహనీయుడని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పయనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాలో చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ విడదల లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఛైర్‌పర్సన్ గంజి చెంచుకుకుమారి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మల్లెల రాజేష్‌నాయుడు, కార్యదర్శి సమ్మద్ ఖాన్, నెల్లూరి సదాశివరావు, జీడీసీసీబీ మాజీ ఛైర్మన్ మానం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

క్రీడల అభివృద్ధికి కృషి

గుంటూరు (స్పోర్ట్స్), జనవరి 18: క్రీడల అభివృద్ధికి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించే విధంగా కృషిచేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎన్‌టిఆర్ 22వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియంలో ప్రారంభమైన ఎన్‌టిఆర్ టెన్నిస్ కప్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన ప్రసంగించారు. పోటీల నిర్వాహక కార్యదర్శి నల్లబోతు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, విచ్చేసిన క్రీడాకారులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలతో పాటు నగదు బహుమతులను అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విచ్చేసిన ముఖ్యఅతిథులు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జీవీ ఆంజనేయులు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు.