గుంటూరు

ధర్మప్రచారమే లక్ష్యంగా స్వర్ణ మహా మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జనవరి 18: మానవీయ సమగ్ర ప్రగతి, వికాసానికి దోహదపడే సార్వజనీన సమ్మేళనమైన మన ప్రాచీన హైందవ సనాతన ధర్మ పరిరక్షణ, ప్రచారమే లక్ష్యంగా ఈ నెల 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు నంబూరు వేదికగా శ్రీ రాధాగోవింద భగవానుని స్వర్ణ మహా మహోత్సవాలు-2018 నిర్వహించనున్నట్లు పూజ్యపాద మహంత్ శ్రీకృష్ణ బలరామ స్వామీజీ వెల్లడించారు. గురువారం సాయంత్రం బ్రాడీపేటలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ భాగవత ధర్మ సమాజ్ నేతృత్వంలో ఈ ఉత్సవాలను మహావైభవంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 2006లో జిల్లాలోని నంబూరులో శ్రీ రాధాగోవింద మందిరాన్ని కూడా ఏర్పాటు చేశామని, 2014 సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రత్యేక శాఖలను కూడా ఏర్పాటు చేశామని స్వామీజీ వివరించారు. 20న మహా నారాయణ యజ్ఞాన్ని నిర్వహిస్తామన్నారు. 21వ తేదీ (108) అష్టోత్తర శతకలశాలు, పుణ్యనదీజలాలతో శ్రీరాధాగోవింద మూర్తులకు మహాభిషేకాన్ని జరుపుతామన్నారు. మందిర శిఖరాభిషేకం కూడా నిర్వహిస్తామన్నారు. ప్రధానంగా 22వ తేదీ వసంతపంచమి (మాగశుద్ధ) పర్వదినాన శ్రీ రాదాగోవిందులు బంగారు రథాలతో స్వయంగా విరాజమానులై భక్తజనులు వెంటరాగా కనుల పండువగా నేత్రోత్సవాన్ని జరుపుకుంటారన్నారు. విలేఖర్ల సమావేశంలో భాగవత ధర్మసమాజ్ ఛైర్మన్ నందిగం లలిత, సీనియర్ ఆడిటర్ ఎం భాస్కరరెడ్డి, డాక్టర్ డిఎన్ దీక్షిత్, ఎం వివేకానందరెడ్డి, సీనియర్ న్యాయవాది కిడాంబి దేవరాజన్, అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, బలరామస్వామీజీ శిష్యులు పాల్గొన్నారు.

క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం

మంగళగిరి, జనవరి 18: క్రీడల ద్వారా వివిధ ప్రాంతాల వ్యక్తుల మధ్య ఐక్యత, మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కలుగుతుందని పొన్నూరు శాసనసభ్యుడు, సంగం డెయరీ చైర్మన్ ధూలిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గల ఎంఎంకె ఇండోర్ స్టేడియంలో మూడురోజుల పాటు జరిగే రాష్టస్థ్రాయి నాన్ మెడలిస్ట్ మెన్స్ డబుల్ షటిల్ టోర్నమెంట్‌ను గురువారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొద్దిసేపు షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. టిడిపి నేత పోతినేని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో నరేంద్ర కుమార్ మాట్లాడారు. స్టేడియం చైర్మన్ సిహెచ్‌కెవి ప్రసాద్, జడ్‌పిటిసి మెంబర్ ఆకుల జయసత్య, మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, పారిశ్రామికవేత్త మోతుకూరి సాంబశివరావు, టిడిపి జిల్లా నేతలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నరేంద్రను సత్కరించారు.

ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లును ప్రజలే అడ్డుకోవాలి

*ఎల్‌ఐసీ ఆలిండియా డివిజనల్ సెక్రటరీ సురేష్

గుంటూరు (పట్నంబజారు), జనవరి 18: బ్యాంకు రుణాల ఎగవేతదారులకు మేలు చేయడంతో పాటు డిపాజిట్‌దారుల రక్షణ బాధ్యత నుండి ప్రభుత్వం తప్పించుకోవడమే లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఫైనాన్షియల్ రీ సొల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లును ప్రజలే అడ్డుకోవాలని ఎల్‌ఐసి ఆలిండియా డివిజనల్ జాయింట్ సెక్రటరి వివికె సురేష్ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక బ్రాడీపేటలోని ఎస్‌హెచ్‌ఒ సమావేశ మందిరంలో ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు - బ్యాంకులు - డిపాజిట్‌దారులపై ప్రభావం అనే అంశంపై నిర్వహించిన సభకు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా సేవకుమార్ అధ్యక్షత వహించారు. సురేష్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలపైనే కాక ఇన్సూరెన్స్ కంపెనీలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. బ్యాంకులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా విలీనం చేసుకునే వెసులుబాటు ఈ బిల్లు కల్పిస్తుందన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ఈ బిల్లు చట్టరూపం దాల్చకుండా చూడాలన్నారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె నాగమల్లేశ్వరరావు, ఎపిజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు మాట్లాడుతూ విదేశాల్లో ఆర్థిక సంక్షోభానికి గురిచేసిన ఈ బిల్లును మన దేశంలోకి తీసుకురావడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర కార్యదర్శి టి సేవాకుమార్ మాట్లాడుతూ తమ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తుందన్నారు.