గుంటూరు

బాధితులకు తక్షణమే పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), జనవరి 19: అగ్రిగోల్డు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని అగ్రిగోల్డు కస్టమర్స్, ఏజంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 23, 24 తేదీల్లో విజయవాడలో అగ్రిగోల్డు రాష్ట్ర సమితి సమావేశాలు జరుగుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు ప్రచారార్భాటాలే తప్ప రైతుల ఆత్మహత్యలు నిలువరించటంలో ఏ మాత్రం చొరవ చూపడంలేదన్నారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, మాన్‌శాంటో పత్తివిత్తనాలువేసి గత మూడేళ్లుగా రైతులు నష్టపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి లేఖ రూపంలో పంపించినప్పటికీ స్పందించ లేదన్నారు. అగ్రిగోల్డు బాధితులు ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియో ఇస్తామని శాసనసభలో ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. ఎస్సెల్ గ్రూపు, అగ్రిగోల్డు కంపెనీలు రెండూ దొంగాట ఆడుతున్నాయని, బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో ఫిరంగిపురానికి చెందిన కొండవీటి బ్రహ్మయ్య పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని ఆరోపించారు. యుద్ధ ప్రాతిపదికన రైతు కుటుంబానికి తక్షణమే 5లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించాలని లేనిపక్షంలో ఈ నెల 22న గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన ఉందా? లేక బ్యూరోక్రాట్ల పాలన సాగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాన్ని అమలుచేయాలని, అమలులో జాప్యం జరిగితే అగ్రిగోల్డు బాధితుల ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో బాధితులకు ఎక్స్‌గ్రేషియో చెల్లించేంత వరకు ఉద్యమాలు కొనసాగుతాయన్నారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె మంత్రునాయక్, జిల్లా కార్యదర్శి కె అగస్టీన్ తదితరులు పాల్గొన్నారు.

కౌలురైతు మృతదేహం వద్ద నివాళి
అప్పుల బాధ తాళలేక గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కొండవీటి బ్రహ్మయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాల ఆదుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జీజీహెచ్‌లో బ్రహ్మయ్య మృతదేహం వద్ద నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. గుంటూరు జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు పైగా మోన్‌శాంటో కంపెనీ బీటీ-3 పత్తి విత్తనాలు రైతాంగాన్ని నట్టేట ముంచాయన్నారు. ఈ విత్తనాల కారణంగా గులాబీరంగు పురుగు సోకి దిగుబడి కోల్పోయారన్నారు. వ్యవసాయశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతిచెందిన రైతులకు తక్షణమే 15 లక్షల ఆర్ధికసహాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముసునూరి రమేష్‌బాబు, రైతు సంఘం నాయకులు కాబోతు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.