గుంటూరు

అవగాహన సరైన మార్గంలో నడిపిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యడ్లపాడు, జనవరి 19: అవగాహనతో చేసే పనులు మనలను సరైన మార్గంలో నడిపిస్తాయని చిలకలూరిపేట ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పీ రాజారాం అన్నారు. యడ్లపాడులో శుక్రవారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. చట్టాలపై ఎంతోకొంత అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. చట్టాలపై అవగాహనతో వ్యవహరిస్తే భవిష్యత్తు సుఖంగా ఉంటుందని, లేకుంటే కొన్నిసార్లు మన చర్యలు శాపాలుగా మారతాయన్నారు. న్యాయవాదులు సదస్సులో వివిధ చట్టాల గురించి ప్రజలకు వివరించారు. చిలకలూరిపేట బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎన్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో రెండవ తరగతి న్యాయమూర్తి పీటర్ రాజు, ఏజీపీ బ్రహ్మానందం, న్యాయవాదులు కె నాగబాబు, బీ రాజేష్, కె నాగేశ్వరరావు, రామకృష్ణ, యడ్లపాడు ఎఎస్‌ఐ శ్యాం, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మీనాక్షి, సరళ పాల్గొన్నారు. అనంతరం కారుచోల గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

‘చెత్త’ సమస్య రానివ్వొద్దు

మంగళగిరి, జనవరి 19: పట్టణ శివారులోని నిడమర్రు రోడ్డులో రైల్వేగేటుకు పడమర వైపుకు గల డంపింగ్‌యార్డును శుక్రవారం మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావు పరిశీలించారు. డంపింగ్‌యార్డులో పేరుకుపోయిన చెత్త నిల్వలను పరిశీలించి క్రమపద్ధతిలో నిల్వలు ఉండే విధంగా సూచనలిచ్చారు. డీఈఈ ఏడుకొండలు, అసిస్టెంట్ ఇంజినీర్లు వెంకట్రామన్, జయచంద్ర నాయక్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ నజీర్, కౌన్సిల్ సభ్యులు బట్టు చిదానంద శాస్ర్తీ, ప్రేమ్‌కుమార్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.