గుంటూరు

మూడేళ్లలో మూడు దశాబ్దాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాలెం, జనవరి 19: మూడు దశాబ్దాల కాలంగా కుంటుపడిన అభివృద్ధిని తమ ప్రభుత్వం మూడేళ్లలో చేసి చూపించిందని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మండలంలోని వీరమ్మ కాలనీ నుండి దేవరపాడు శ్రీ వేంకటేశ్వర దేవస్థానం వరకు ఏర్పాటైన సీసీ రోడ్డును, దేవరపాడు గ్రామంలో రూ 5 కోట్ల 38 లక్షల అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఎమ్మెల్యే గెలిచినా ఆ గ్రామానికి ఒకసారి, రెండు సార్లు వస్తారే తప్ప నేను ఈ గ్రామానికి పదిసార్లు వచ్చానని ఇందుకు ప్రధాన ఉద్దేశం గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం ప్రయత్నించటమే అన్నారు. గతంలో ఎస్సీ కాలనీలు వర్షం వస్తే బురద.. పూరిగుడిసెలతో నిండి ఉండేవని అలాంటిది అన్ని కాలనీలలో సీసీ రోడ్లు, ఎన్టీఆర్ పక్కా గృహాలుగా నిర్మాణం చేశామన్నారు. ప్రపంచం అంతా సత్తెనపల్లి వైపు చూసే విధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మహిళలు ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు ప్రతి ఇంటికీ ఏర్పాటు చేశామని, ప్రతి గ్రామంలో మూడు మతాలకు సంబంధించిన స్మశాన స్థలాలను దేవాలయాలుగా తీర్చి దిద్దామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అంచు నరసింహారావు, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ నర్రా బాబురావు, యార్డు చైర్మన్ వెంకట కోటయ్య, తెనాలి కాల్వ డైరెక్టర్ అంకాల ప్రభుదాస్, గ్రామ సర్పంచ్ చామకుర్తి శ్రీను, ఎంపీటీసీ వర్ల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

రైల్వేట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం

పొన్నూరు, జనవరి 19: పొన్నూరు పట్టణ నిడుబ్రోలు ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై బాపట్ల మార్గంలో గుర్తుతెలియని మృతదేహాన్ని శుక్రవారం రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహం గుర్తించలేని విధంగా ఛిద్రమై ఉంది. మృతుడి ఎడమ చేతిపై విజయ అని ఆంగ్లంలో పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి రైల్వే ఎస్‌ఐ మహాలక్ష్మి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

జూట్‌లో కార్మికుల వాటా ఎంత?

గుంటూరు, జనవరి 19: భజరంగ్ జూట్‌మిల్లుకు సంబంధించి డీఐఎఫ్‌ఆర్ ఒప్పందం కింద కార్మికులకు 40శాతం వాటా ఉందో లేదో ఈ నెల 25వ తేదీలోగా స్పష్టత ఇవ్వకపోతే ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడతామని పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం అరండల్‌పేటలోని కార్మికశాఖ సంయుక్త కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ లక్ష్మీనారాయణకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ జూట్‌మిల్లు అక్రమ లాకౌట్‌పై గడచిన రెండున్నరేళ్లుగా చట్టాన్ని నమ్ముకున్న కార్మికుల పక్షాన అనేక రూపాల్లో ఉద్యమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. అన్యాయానికి గురవుతున్న కార్మికులకు తాము అండగా నిలుస్తుంటే బాధ్యతగల అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈనెల 5వ తేదీన కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆయన నివాసంలో కలసిన నేపథ్యంలో కార్మికుల వాటా 40 శాతంపై కొద్దిరోజుల్లో హామీ ఇచ్చారని 15 రోజులు గడిచినా స్పష్టత ఇవ్వలేదన్నారు. రాజధాని ప్రాంతంలో అతిపెద్ద పరిశ్రమ అయిన జూట్‌మిల్లు మూత పడి వేలాదిమంది కార్మికులు రోడ్డునపడినా పట్టించుకోని ప్రభుత్వం రాజధానికి నూతన పరిశ్రమలు తెస్తామంటే నమ్మే పరిస్థితులు ఏ మాత్రం లేవన్నారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, గులాం రసూల్, పాండురంగ, మండేపల్లి బాబు, మంత్రి మహానంది తదితరులు పాల్గొన్నారు.

‘గొట్టిపాడు’ ఘటనను రాజకీయం చేయొద్దు

గుంటూరు, జనవరి 19: గొట్టిపాడు సంఘటనను స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకోవాలని చూస్తే సహించేదిలేదని మాలమహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు స్పష్టంచేశారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో జరిగిన సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ పెదగొట్టిపాడు గ్రామంతో సంబంధంలేని కొందరు తమ సొంత అజెండాతో రెచ్చకొట్టే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామంలో ఇరు సామాజికవర్గాల మధ్య స్వల్ప వివాదం సమసిపోయిందని తిరిగి గ్రామంలో ఘర్షణలు చెలరేగేలా కొందరు చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. తమ విధులను నిజాయితీగా నిర్వహిస్తున్న కలెక్టర్, ఎస్పీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న కొన్ని ప్రజా సంఘాల నాయకులను రాష్ట్రంలో తరిమికొట్టే సమయం దగ్గరలోనే ఉందన్నారు. అలాగే మంత్రి నక్కా ఆనంద్‌బాబుపై వారు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మరోసారి పునరావృతమైతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఘటనకు సంబంధించి వారికి చిత్తశుద్ది ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈనెల 24వ తేదీన ఛలో గొట్టిపాడుకు ప్రజా సంఘాల ముసుగులో ఇచ్చిన పిలుపునకు ఎవరూ స్పందించటంలేదని, ఇది ఏ దళిత సంఘానికి సంబంధించింది కాదని స్పష్టం చేశారు. సమావేశంలో భీమసేన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ నాగభూషణం, మాలమహానాడు నాయకురాలు పిల్లి దేవి, మాలమహానాడు యువత జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణకుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అడపా మోహన్, ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిద బాబురావు, ఎం అనీల్, బి నరేష్, బి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

నేటినుంచి నరసింహమాల దీక్షలు

మంగళగిరి, జనవరి 19: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నరసింహ మాలా దీక్షలు శనివారం నుంచి ప్రారంభ మవుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి మండెపూడి పానకాలరావు శుక్రవారం తెలిపారు. 41 రోజుల మండల దీక్ష శనివారం ప్రారంభ మవుతుందని, వచ్చే నెల 9వ తేదీనుంచి 21 రోజుల అర్ధ మండల దీక్ష ప్రారంభ మవుతుందని, వచ్చే నెల 19వ తేదీనుంచి 11 రోజుల ఏకాదశి దీక్ష ప్రారంభ మవుతుందని, దీక్ష తీసుకునే భక్తులు గురుస్వామి మాల్యవంతం శ్రీనివాస దీక్షితులును ఫోన్ నెంబర్ 9441898523 సంప్రదించాలని ఆయన కోరారు. దీక్ష తీసుకునే భక్తులకు తోట శ్రీనివాసరావు, టిఎస్‌ఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యాన ఒక జత వస్త్రాలు, దీక్ష సమయంలో నిత్య అన్నదానం నిర్వహిస్తారని, మార్చి 2వ తేదీన ఇరుముడులు, గిరి ప్రదక్షిణ అనంతరం అదేరోజు సాయంత్రం 6 గంటలకు పూర్ణాహుతి, దీక్షల విరమణ జరుగతుందని ఆలయ ఇఓ పానకాలరావు తెలిపారు.