గుంటూరు

బీటీ బాధిత రైతుల కోసం రేపు ఛలో కలెక్టరేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), జనవరి 20: బీటీ పత్తి విత్తనాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన ఛలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చామని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ తెలిపారు. శనివారం కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అనేక గ్రామాల్లో 60 నుంచి 70 వేల రూపాయల పెట్టుబడి పెట్టి మోన్‌శాంటో కంపెనీకీ చెందిన బీటీ పత్తి విత్తనాలు వేస్తే పెట్టుబడులు తిరిగిరాక మానసిక ఆందోళనలో రైతాంగం ఉన్నారన్నారు. పంట ఏపుగా పెరిగినప్పటికీ గులాబీరంగు పురుగు కారణంగా పంట చేతికిరాలేదని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి, వ్యవసాయ మంత్రికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందనలేదన్నారు. పంట నష్టపోయిన రైతులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలోనే బ్రహ్మయ్య అనే రైతు ఆత్మహత్యకు పాల్పడటం ఇందుకు నిదర్శనమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ 5 నుంచి 10 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముసునూరి రమేష్‌బాబు మాట్లాడుతూ గతేడాది మిర్చికి ధర లేకపోవడంతో ఈ ఏడాది పత్తిపంట వైపు మొగ్గు చూపిన రైతాంగం వౌన్‌శాంటో కంపెనీకి చెందిన బీటీ విత్తనాల వల్ల పూర్తిగా నష్టపోయా రన్నారు. ప్రభుత్వం స్పందించి ఎకరానికి రూ 15 వేల నష్టపరిహారం అందించి ఆదుకోవాలన్నారు. సమావేశంలో సీపీఐ నగరకార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణ మూర్తి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

నృసింహుని మండల దీక్షలు ప్రారంభం

మంగళగిరి, జనవరి 20: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 41 రోజుల మండల దీక్షలు శనివారం ప్రారంభ మయ్యాయి. గురుస్వామి మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు మాలాధారణ చేశారు. ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు ఎగువ సన్నిధిలోని పానకాలస్వామి ఆలయ ప్రాంగణంలో దీక్షా పరులకు పసుపుపచ్చ వస్త్రాలు అందజేశారు. తోట శ్రీనివాసరావు, టిఎస్‌ఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యాన దీక్షాపరులకు వస్త్రాలు సమకూర్చారు. వచ్చే నెల 9 నుంచి 21 రోజుల అర్ధమండల దీక్ష, 19 నుంచి 11 రోజుల ఏకాదశి దీక్ష ప్రారంభ మవుతుందని ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు తెలిపారు. కార్యక్రమంలో తోట శ్రీనివాసరావు, షేక్ వజీర్ సుల్తాన్, నల్లగొర్ల శ్రీనివాస్, మహేష్, భోగి వినోద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయ ఆవరణలో దీక్షాపరులకు అన్నప్రసాద వితరణ జరిగింది.