గుంటూరు

టెన్నిస్ విజేతలు భరణీదత్, లక్ష్మీశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు స్పోర్ట్స్, జనవరి 20: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో గత మూడురోజులుగా జరుగుతున్న టెన్నిస్ పోటీలలో అండర్-12 బాలబాలికల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ధరణీదత్తు, లక్ష్మీశ్రీ విన్నర్స్ టైటిల్ కైవసం చేసుకున్నారు. రన్నర్స్‌గా కేవీ అపరూప్, జోత్స్న నిలిచారు. అండర్-14 బాలబాలికలలో ఎం గ్రాహిత్, పి లావణ్యలు, నితిన్‌సాయి చౌదరి, యశస్విలు వరుసగా విన్నర్స్, రన్నర్స్ టైటిల్ సాధించారు. అండర్-16 బాలురలో వి.ప్రీతమ్, పీజె అజయ్‌కృష్ణవంశీలు వరుస స్థానాల్లో నిలిచారు. 35 సంవత్సరాలు పైబడిన పురుషుల విభాగంలో మహేష్, చందనల జంట విన్నర్స్‌గా, మేఘనాథ్, పాల్‌మనోహర్‌ల జంట రన్నర్స్‌గా నిలిచారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జీవీ ఆంజనేయలు, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్యఅతిధిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మద్దాళి గిరిధర్, బలరామయ్య, సాదినేని కోటేశ్వరరావు, తులసీ ధర్మచరణ్, కమల్, ఎన్ శ్రీనివాసరావు, ఎ సుబ్బారావు, శిక్షకులు జీవీఎస్ ప్రసాద్, అహ్మద్, టీవీ రమణ, అప్పారావు, పాల్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్టప్రతిని కలిసిన జెడ్పీ మాజీ చైర్మన్ పాతూరి

మంగళగిరి, జనవరి 20: మండల పరిధిలోని పెదవడ్లపూడి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ మాజీచైర్మన్ పాతూరి నాగభూషణం శనివారం ఢిల్లీలో రాష్టప్రతి భవన్‌కు వెళ్లి భారత రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్‌ను మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మప్రచారక్ కూడా పాతూరితో పాటు రాష్టప్రతిని కలిసిన వారిలో ఉన్నారు.