గుంటూరు

రేపటిలోగా ఉత్తమ సేవకుల జాబితా ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 20: ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయటంలో విశేష సేవలందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 26వ తేదీన జరిగే 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రశంసాపత్రాలు అందించేందుకు జాబితాను 22వ తేదీ సాయంత్రంలోగా తమ కార్యాలయంలో అందజేయాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో వివిధశాఖలకు చెందిన జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాబితాతో పాటు సేవలందించిన ఉద్యోగి, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు కూడా అందిస్తే ప్రశంసా పత్రంలోనే ముద్రించి అందజేస్తామన్నారు. సమయం తక్కువగా ఉన్నందున అధికారులు వారి సిబ్బంది జాబితాను సోమవారం అందించాలన్నారు. నాణ్యమైన ఫొటోలు పంపాలని, ఒకరు లేక ఇద్దరికి మించి ఉద్యోగుల జాబితా ఉండరాదన్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉద్యమ రీతిలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి నూరుశాతం నిర్మించడంలో విశేష కృషి చేసిన గ్రామ, మండల స్థాయి అధికారుల వివరాలను సేకరించి పరిశీలించి కష్టపడి పనిచేసిన వారి వివరాలను అందజేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ, జిల్లా పంచాయతీ అధికారులకు సూచించారు. సిఫార్సు చేసిన ఉద్యోగి వివరాల్లో ఏ కారణంతో ఏ సందర్భంగా సేవలందించారో కలెక్టర్ కార్యాలయం విడుదల చేసిన ప్రొఫార్మాలో పొందుపరచాలన్నారు. ప్రధానంగా స్వచ్ఛ భారత్, బహిరంగ మల విసర్జన లేని గ్రామం తదితర కార్యక్రమాల అమలులో ఉత్తమ సేవలందించిన ఉద్యోగికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే గణతంత్ర వేడుకలలో మూడు ప్రభుత్వ, మరో మూడు ప్రైవేటు పాఠశాలలతో కలిపి మొత్తం 6 పాఠశాలల నుంచి ఎంపిక చేసిన విద్యార్థినీ, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు, అటవీ, పౌరసరఫరాలు, వైద్య, ఆరోగ్య, ఉపాధిహామీ పథకం, రుణాలు, ఫించన్లు తదితర ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరుపై శకటాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ కృతికా శుక్లా, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్, జిల్లా రెవిన్యూ అధికారి కె నాగబాబు, నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ, జీజీహెచ్ పర్యవేక్షకుడు డాక్టర్ రాజునాయుడు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

హోంగార్డులు ప్రజలతో మమేకం

*అర్బన్ ఎస్పీ విజయారావు హితవు

గుంటూరు, జనవరి 20: హోంగార్డులు విధి నిర్వహణలో ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలిగి మమేకం కావాలని అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు ఉద్ఘాటించారు. శనివారం స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో హోంగార్డుల దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ విజయారావు మాట్లాడుతూ పోలీసు శాఖలో ఒక భాగమైన హోం గార్డు వీఐపి, వీవీఐపిల బందోబస్తులో సేవలు అందిస్తున్నారని అభినందించారు. కష్టపడి పనిచేసే వారికి శాఖాపరంగా ప్రశంసాపత్రాలతో పాటు రివార్డులు అందిస్తామన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోం గార్డులు తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పోలీసు శాఖలో ఉంటూ విధులు సక్రమంగా నిర్వహించకుండా నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదన్నారు. ఈ సందర్భంగా పలువురు హోం గార్డులు ఎస్పీకి తమ సమస్యలు వివరించారు. తన పరిధిలో ఉన్నవాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు, డీఎస్పీలు సరిత, వెంకటరెడ్డి, శ్రీనివాస్, ఆర్‌ఐలు విజయసారథి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.