గుంటూరు

ప్రజలకు జవాబుదారీగా న్యాయవ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), జనవరి 20: రాజ్యాంగంలోని నాలుగు మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థ ప్రజలకు కూడా జవాబుదారీగా వ్యవహరించాలని న్యాయవ్యవస్థ అంతిమలక్ష్యం న్యాయరక్షణతో పాటు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కావాలని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ అభిప్రాయపడ్డారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలూ)రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక రింగురోడ్డులోని ఫంక్షన్ హాలులో ‘సుప్రీం కోర్టులో ఇటీవల పరిణామాలు, న్యాయవ్యవస్థ పరిపాలన’ అనే అంశంపై సదస్సు జరిగింది. సదస్సుకు ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న జస్టిస్ శంకర్ మాట్లాడుతూ మన దేశంలో న్యాయమూర్తుల నియామకం సరైన పద్దతిలో లేనందువల్లే వ్యవస్థాపరంగా పలు లోపాలు తలెత్తుతున్నాయని ఇప్పటి వరకు హైకోర్టు, సుప్రీం కోర్టులలో 130 కుటుంబాల నుంచే పెద్దసంఖ్యలో న్యాయమూర్తులుగా నియమితులయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర స్థాయిలోని న్యాయస్థానాల్లో కొలీజియం ద్వారా న్యాయమూర్తుల నియామకాలు ఏ మాత్రం సరికావని జస్టిస్ శంకర్ అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు న్యాయవాది, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన భీమ్‌సింగ్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థ దేశభక్తి, సౌభ్రాతృత్వం పెంపొందించేలా కృషి చేయాలికానీ, వారిలో వారే కుమ్ములాడుకోరాదని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి అధికార వ్యవస్థ ఉన్న ఏ సంస్థలో అయినా కుమ్ములాటలు సహజమని, అయితే వాటిని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్, కేఎల్‌యూ లా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ రంగయ్య మాట్లాడుతూ చట్టబద్ధమైన పాలన న్యాయవ్యవస్థకు కూడా వర్తిస్తుందని, బాహాటంగా వ్యవస్థ లోపాలను న్యాయమూర్తులు ప్రస్తావించడం పట్ల చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ జవాబుదారీగా వ్యవహరించే సుప్రీం కోర్టు తీరు సరిగాలేకుంటే వారిచ్చే తీర్పుల పట్ల ప్రజలు, కక్షిదారులు విశ్వాసం కోల్పోతారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలీ, ఐలూ నాయకులు షేక్ సయ్యద్‌బాబు, నీలం శంకరరావు, ఇళ్ల మధుబాబు, బీ సలీం, జీ భాస్కరరావు, జీ నరసింహారావు, జీ కిరణ్‌బాబు, సురేంద్రబాబు, రవికుమార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

3న ఉప రాష్టప్రతి రాక

పెదనందిపాడు, జనవరి 20: భారత ఉప రాష్టప్రతి రాకపై అధికార యంత్రాంగం శనివారం కసరత్తు ప్రారంభించారు. పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్వర్ణోత్సవాలు ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా భారత ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. గత మూడేళ్లుగా జస్టిస్ లావు నాగేశ్వరరావు పెదనందిపాడు గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామాభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఉప రాష్టప్రతి పర్యటనకు మూడు హెలీకాప్టర్లు దిగేందుకు అనువైన స్థలం కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం, ఆర్టీసి బస్టాండు, నాగులపాడులో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గతంలో లాండ్ అయిన హెలీకాప్టర్ స్థలాన్ని ఆర్ అండ్ బీ ఎస్‌ఈ మాధవీ సుకన్య, సీఈఒ నాగార్జునసాగర్, తహశీల్దారు కె మోహన్‌రావు, ఎంపీడీవో ఖాజాబీ, పొన్నూరు సీఐ సుబ్రహ్మణ్యం, ఎంపీపీ ఎం నాగరాజకుమారి, పోలినేని అంకమ్మ చౌదరి తదితరులు పరిశీలించారు. కాగా ఎంపీడీఒ కార్యాలయంలో గ్రామాభివృద్ధిపై జరిగిన సమీక్షలో సీఈఒ నాగార్జునసాగర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉపరాష్టప్రతి పర్యటన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్ అండ్ బి రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.