గుంటూరు

ఉప రాష్టప్రతి పర్యటన ఖర్చుపై మల్లగుల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదనందిపాడు, జనవరి 21: భారత ఉప రాష్టప్రతి రాక ఎలా ఉన్నా అందుకు అయ్యే వ్యయాన్ని ఎవరు భరిస్తారనే మీమాంశతో అధికార యంత్రాంగం అయోమయంలోపడింది. వచ్చేనెల 3న కళాశాల స్వర్ణోత్సవాలకు పెదనందిపాడుకు ఉపరాష్టప్రతి రాకను దృష్టిలో ఉంచుకుని వివిధ శాఖల అధికారులు ఆదివారం స్థల పరిశీలన చేశారు. ఒకేసారి రక్షణ శాఖకు చెందిన మూడు హెలీకాప్టర్లు ఒకే గ్రౌండ్‌లో దిగేందుకు వీలుగా గత రెండురోజులుగా అధికారులు ఈ పరిశీలన జరుపుతున్నారు. తాజాగా నాగులపాడు ఉప మార్కెట్ యార్డు దగ్గరలో వ్యవసాయ పంట పొలాలను పరిశీలించారు. పొలాల్లో వేసిన పత్తి, సెనగ, జొన్న పంటలను తీసి చదును చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సందర్శన కోసం ఏర్పాటుచేసిన హెలీపాడ్ ఇప్పటికీ అలానే ఉంది. ఈ రెండు ప్రాంతాలు హెలీపాడ్‌కు అనువుగా ఉన్నప్పటికీ నిర్మాణానికి సంబంధించిన ఖర్చుపై అధికారులు తటపటాయిస్తున్నారు. సుమారు రూ 53 లక్షల అంచనాకు వచ్చిన అధికారులు ఏకంగా పంట పొలాల్లో అయితే రూ 90 లక్షలు వెచ్చించాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. హెలీపాడ్, అప్రోచ్‌లైన్ నిర్మాణంతో పాటు ఉపరాష్టప్రతి పర్యటన అనంతరం నిర్మాణాలు తొలగించాల్సి ఉండటంతో ఖర్చు తడిసి మోపెడవుతుందని ఆర్ అండ్ బి అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ముఖ్యమంత్రితో పాటు ఇతర వీవీఐపిల రాక సందర్భంగా నిర్మించిన హెలీపాడ్‌లకు అయ్యే ఖర్చు ప్రభుత్వం నుండి నయాపైసా కూడా మంజూరు కాలేదని చెప్తున్నారు. కొన్ని కోట్ల బిల్లులు అనుమతి పొందాల్సి ఉంది. ఇప్పుడు తాజా పర్యటనలతో మూలిగే నక్కపై తాటికాయపడిన చందంగా ఉంటుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కళాశాల యాజమాన్యం కొందరు అధికార పార్టీ నాయకులను, అధికారుల ఖర్చు విషయమై సంప్రతించారు. మేం పిలిస్తే వచ్చేవారమే తప్ప ఆర్ధిక అవసరాలు తీర్చేవారం కామని చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ఉపరాష్టప్రతిని గుంటూరు నుండి రోడ్డు మార్గంలో తీసుకువస్తే వెసులుబాటుగా ఉంటుందని అధికారులు ఆర్ అండ్ బి ఎస్‌ఈ మాధవీ సుకన్య, ఆర్డీవో బి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. సీఈఒ నాగార్జునసాగర్, తహశీల్దారు కే మోహన్‌రావు, ఎంపీపీ నాగరాజకుమారి తదితరులు జిల్లా అధికారుల వెంట ఉన్నారు.