గుంటూరు

ఐదుగురు సీపీఎం నేతల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, జనవరి 22: జిల్లాలో సంచలనం రేకెత్తించిన పెదగొట్టిపాడు సంఘటనలో అసలు నిందితులపై కేసులు నమోదు చేయకపోవటం వల్లే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోందని జిల్లా సీపీఎం తూర్పు కార్యదర్శి పాశం రామారావు ఆరోపించారు. గొట్టిపాడు సంఘటనపై ఈనెల 24న అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాలు సంయుక్తంగా ఛలో గొట్టిపాడు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో సీపీఎం జిల్లా తూర్పు కార్యదర్శి రామారావు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎ మాల్యాద్రి, జిల్లా కేవీపీఎస్ కార్యదర్శి కృష్ణమోహన్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు గొట్టిపాడు గ్రామం వెళ్లారు. రాత్రంతా అక్కడే ఉండి బాధిత దళితులను పరామర్శించారు. అయితే సోమవారం ఉదయం పోలీసులు వీరు నలుగురుని అరెస్టుచేసి చేబ్రోలు పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం కార్యకర్తలు చేబ్రోలు పోలీసు స్టేషన్‌కు తరలివచ్చారు. పోలీసుస్టేషన్‌లో పాశం రామారావు విలేకర్లతో మాట్లాడుతూ గొట్టిపాడు ఘటనలో పోలీసులు అసలు నిందితులను వదిలేసి సంబంధంలేని వ్యక్తులపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం సమయంలో సీపీఎం నాయకులు కృష్ణయ్యను కూడా అరెస్టుచేసి చేబ్రోలు పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు.
అధికారులకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ నాయకులు
నరసరావుపేట, జనవరి 22: నరసరావుపేట నియోజకవర్గంలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ఏ ప్లస్ మార్కులు సాధించినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులకు, డ్వాక్రా మహిళలకు, అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి కొల్లి ఆంజనేయులు మాట్లాడుతూ నరసరావుపేటలో ఎన్ని ప్రభుత్వ శాఖలు ఉన్నాయో వారందరూ ఈ ఏ ప్లస్ రావడానికి కారకులని అన్నారు. అదే విధంగా నరసరావుపేట మండలంలోని కాకాని వద్ద నిర్మించే జేఎన్‌టీయూ కళాశాలకు 85 ఎకరాల స్థలం మంత్రివర్గం ఆమోదించిందని, దీనికి సీఎం చంద్రబాబునాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. నరసరావుపేట అన్ని స్థానాల్లో అగ్రస్థానంలో ఉంచడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని అన్నారు.
తాము ప్రభుత్వ కార్యాచరణ అమలు చేయడానికి కృషి చేస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. జిల్లా పార్టీ కార్యదర్శి చిరుమామిళ్ళ బ్రహ్మయ్య మాట్లాడుతూ జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గం ఏ ప్లస్ సాధించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాలకు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు కోడెల శివరాం సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందని, వారికి కృతజ్ఞతలని అన్నారు. మాజీ ఎంపీపీ కడియం కోటి సుబ్బారావు మాట్లాడుతూ నియోజకవర్గం జన్మభూమి కార్యక్రమంలో ఏ ప్లస్ స్థానంలో నిలవడం సంతోకరమైన విషయమన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కోడెల శివరాం తదితరులు ఈ ఏప్లస్ మార్కులు సాధించడానికి కారకులని అన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో నోడల్ టీం బాగా పనిచేసిందన్నారు. ప్రజలందరూ పార్టీలకు అతీతంగా జన్మభూమికి సహకరించారని అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్‌యార్డు చైర్మన్ బొడ్డపాటి పేరయ్య, వైస్ చైర్మన్ కొట్టా కిరణ్, తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ నాగూర్, శివయ్య, గంగుల పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.