గుంటూరు

నేడు జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదనందిపాడు, జనవరి 22: తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం పెదనందిపాడులో మంగళవారం జరగనుంది. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, పరిటాల సునీతతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హాజరు కానున్నారు. మండల పార్టీ శాఖ ఆధ్వర్యంలో నాగులపాడు శ్రీనివాస పాఠశాలలో జరగనున్న సమావేశ ఏర్పాట్లను సోమవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు సమన్వయ కమిటీ సమావేశం, 7 గంటలకు బహిరంగ సభ జరుగుతుందని వివరించారు. రాత్రి 8 గంటలకు నల్లమడ వాగుపై నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. ఎంపీపీ ఎం నాగరాజకుమారి, ఉపాధ్యక్షుడు ఎం బాలకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తూనికలు, కొలతల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు
వినుకొండ, జనవరి 22: పట్టణంలో సోమవారం జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వివిధ షాపులపై కేసులు నమోదు చేశారు. స్థానిక బియ్యం కొట్టులో 25 కేజీల బస్తాకుగాను 23 కేజీలు మాత్రమే ఉండటంతో ఆ షాపుపై కేసు నమోదు చేశారు. అలాగే ఫ్యాన్సీ షాపులు, కిరాణా షాపులు, ఐరన్ అండ్ హార్డ్‌వేర్ దుకాణాలు తదితర షాపులపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లా తూనికలు, కొలతల శాఖాధికారి దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఈ తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు.
వరిలో సరాసరి ఎకరానికి 38 బస్తాల దిగుబడి
కాకుమాను, జనవరి 22: మండల పరిధిలోని గ్రామాల్లో వరిసాగు దిగుబడి ఎకరానికి 38 బస్తాలు వస్తుందని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ అధికారి రామకృష్ణ తెలిపారు. మండల పరిధిలోని కొండపాటూరు గ్రామంలో సోమవారం వరి రకం ఎన్‌ఎల్‌ఆర్ పంట కోత ప్రయోగాన్ని నిర్వహించి దిగుబడులను వివరించారు. గ్రామానికి చెందిన కొండా శ్రీనివాసరావు పొలంలో ఎకరానికి 42 బస్తాల దిగుబడి వచ్చిందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఒ పంగులూరు శ్రీనివాసరావు, ఎంపీఈఒ దాక్షాయణి, రైతులు పాల్గొన్నారు.