గుంటూరు

అమరావతిలో ఘనంగా అమ్మకు వందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 22: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అమ్మకు వందనం కార్యక్రమం వసంత పంచమి సందర్భంగా మండల పరిధిలోని ప్రాథమిక,ప్రాథమికోన్నత, ఎయిడెడ్ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీయుపి స్కూలులో ప్రధానోపాధ్యాయుడు ఎం సాంబశివరావు అధ్యక్షతన చిన్నారులు తల్లిదండ్రులకు పాదాభివందనం చేయగా, తల్లిదండ్రులు వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎల్ ఉమామహేశ్వరరావు, ఎం పద్మావతి, బి పద్మావతి, ఎస్‌కె ఖైరున్నీసా, ఎస్‌కె షారాబీ, అంగన్‌వాడీ కార్యకర్త సీహెచ్ భారతి తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక ఆది ఆంధ్ర పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన మండల పరిధిలోని దిడుగు ఆర్‌సీఎం ఎయిడెడ్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వి రాయప్ప అధ్యక్షతన అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహించారు.
ఆధ్యాత్మిక ఆరామం ఓంకార క్షేత్రం
గుంటూరు (కల్చరల్), జనవరి 22: ప్రతి నిత్యం అనేక దశాబ్దాలుగా దైవ నామ స్మరణ, శ్రీ సీతారామ నామంతో వీటన్నింటికీ తోడు మహాభిషేకాలతో సందడిచేసే బ్రాడీపేటలోని ప్రసిద్ధ ఓంకారక్షేత్రం గర్తపురిలోని ఆధ్యాత్మిక ఆరామమని కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి తన అనుగ్రహ భాషణంలో పేర్కొన్నారు. సోమవారం రాత్రి స్వామీజీ వారంరోజుల పాటు జరిగే క్షేత్ర 88వ సంఘ వార్షికోత్సవాలు, 84 వ శ్రీరామనామ సప్తాహ మహోత్సవాన్ని ప్రారంభించారు. భక్తుల నుద్దేశించి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి తమ అనుగ్రహ భాషణాన్ని కొనసాగిస్తూ పూర్వాశ్రమంలో తనకు ఈ క్షేత్రంతో అనుబంధం ఉందని అన్నారు. శ్రీ సీతారామాంజనేయ నగర సంకీర్తన సంఘం ఆధ్యాత్మిక, థార్మిక ప్రచారానికి ధర్మ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తూనే ఉందని స్వామీజీ ఆశీస్సులు అందించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ గంగా భువనేశ్వరీ సమేత ఓంకారేశ్వర స్వామికి కళ్యాణోత్సవాన్ని దంపతులు భాగస్వామ్యంతో నిర్వహించారు.