గుంటూరు

నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), జనవరి 22: రాష్ట్రంలో బీటీ విత్తనాలతో పత్తి పంట పండించి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద పత్తిపంట వేసి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల ఎకరాల్లో రైతాంగం బీటీ పత్తి విత్తనాలు వేశారని, గుంటూరు జిల్లాలో మోన్‌శాంటో వేసిన రైతులు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. రైతులు ఎకరానికి రూ 50వేలు వరకు పెట్టుబడులు పెట్టినప్పటికీ కనీసం కూలీ ఖర్చులు కూడా తిరిగి రాలేదన్నారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవటంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎకరానికి రూ 15 వేల పరిహారం క్రాప్ ఇన్సూరెన్స్ వర్తించేలా మోన్‌శాంటో కంపెనీ, ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏపి రైతుసంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ మాట్లాడుతూ గులాబీరంగు పురుగు నివారించేందుకు బీటీ పత్తి విత్తనం వాడాలని మోన్‌శాంటో రైతుల్ని నమ్మించిందని, ఆ విత్తనాలతో పురుగు నివారణ కాకపోగా మరింతగా పెరిగిపోయి పత్తి కాయలను పూర్తిగా కబళించిందన్నారు. దీంతో గుడ్డిపత్తి ఏర్పడి ధర లభించక రైతులు నిలువునా మునిగారన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం పత్తి పంట సాగు అంచనా వేసి అక్కడి రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిందని, అదేవిధంగా ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి మోన్‌శాంటో కంపెనీపై క్రిమినల్ కేసులు బనాయించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల్ని ఆదుకుంటామని నమ్మ బలుకుతున్నారే తప్ప నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ పత్తిపంట వేసి రైతాంగం నష్టపోయారని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోగా చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. తొలుత కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా జడ్పీ కార్యాలయం వరకు చేరుకుని మీకోసం కార్యక్రమంలో ఉన్న కలెక్టర్ కోన శశిధర్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి, ముసునూరి రమేష్‌బాబు, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, వేమూరి సుబ్బారావు, వీ వెంకటేశ్వరరెడ్డి, ఈశ్వరరావు, పులి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రియురాలిపై కత్తితో దాడి..

*ఆనక తాను పొడుచుకుని ఆస్పత్రి పాలు
సత్తెనపల్లి, జనవరి 22: అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ప్రియురాలిని ఇంటికి పిలిపించి కత్తితో దాడి చేసి తాను కత్తితో పొడుచుకున్న సంఘటన ఆదివారం రాత్రి సత్తెనపల్లి పట్టణంలోని అచ్చంపేట రోడ్డులోగల శివాలయం సమీపంలో జరిగింది. పట్టణ ఎస్సై రాంబాబు తెలిపిన సమాచారం మేరకు వివాహతుడైన కమ్మనేతుల రామాంజనేయులు స్థానిక పాత బస్టాండ్‌లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సమీపంలో బడ్డీకొట్టు నిర్వహిస్తుంటాడు. బడ్టీ కొట్టు ఎదురుగావున్న ఆసుపత్రిలోని ల్యాబ్‌లో పనిచేసే మహిళతో ఐదేళ్ళ క్రితం పరిచయం అయింది. ఈమెది కృష్ణాజిల్లా కంచికచర్ల కాగా ఇద్దరూ కలిసి సత్తెనపల్లిలోని నాగన్నకుంటలో ఇల్లు కొనుగోలు చేసి సహజీవనం చేస్తున్నారు. ప్రియురాలి పోషణ బాధ్యతలన్నీ రామాంజనేయులు చూస్తున్నాడు. కాని నాలుగు నెలల నుండి పిడుగురాళ్ళలోని సూపర్ బజార్‌లో పనిచేస్తూ అక్కడే ఉంటోంది. అక్కడ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఎవరో చెప్పిన మాటలువిని రామాంజనేయులు అక్కడికి వెళ్ళి నిలదీయగా తనతో సంబంధాన్ని మానుకోవాలనిఆమె అతడితో చెప్పింది. తనని వదిలించుకొని మరొకరితో గడిపేందుకే సంబంధం వదులుకోవాలని అంటోందని నిర్ధరణకు వచ్చిన రామాంజనేయులు మాటల్లోపెట్టి సత్తెనపల్లిలోని తన ఇంటికి తీసుకువచ్చి ఆమెపై కూరగాయలు కోసే కత్తితో దాడిచేయడంతో ఆమె ముఖం, చేతులు, గొంతుపై గాయలయ్యాయి. అదే కత్తితో తాను ఎడమచేతిపై పొడుచుకున్నాడు. అక్కడివారు వెంటనే విషయాన్ని పట్టణ పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సోమవారానికి వారిరువురు కోలుకొని ఒకరికి ఒకరు పరిచర్యలు చేసుకుంటున్నారని సర్కిల్ ఎన్స్‌పెక్టర్ ఆర్ సురేష్‌బాబు తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.