గుంటూరు

ఇదో చారిత్రక ఘట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సతైనపల్లి, జనవరి 23: స్థానిక చెరువు, ట్యాంక్, పార్కు, ఫుడ్‌కోర్టు, చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, వావిలాల ఘాట్, స్టేడియం నిర్మాణం ఇతర అభివృద్ధి పనులను స్పీకర్ కోడెల మంగళవారం పరిశీలించారు. సతైనపల్లి సీఆర్డీఏ పరిధిలో ఉండడంతో అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఆర్డీఏ కమిషనర్ శ్రీ్ధర్‌ని స్పీకర్ కోరారు. అనంతరం స్పీకర్ కార్యాలయంలో 13 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.

ఆదరణ లేకే ఆత్మహత్యలు

గుంటూరు, జనవరి 23: ఆరుగాలం శ్రమించి జనానికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు ఆదరణ లేకపోవడంతోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఇంత జరుగుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షతకు సాక్షాత్తు ప్రభుత్వ కార్యాలయాల్లోనే మరణ మృదంగం మోగటం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఫిరంగిపురం మండలానికి చెందిన బ్రహ్మయ్య అనే రైతు గతంలో మిర్చివేసి సరైన దిగుబడిరాలేదని ఈ ఏడాది ప్రత్తిపంట వేసి పెట్టుబడులు సైతం తిరిగిరాక సాక్షాత్తు కలెక్టరేట్‌లో ఆత్మహత్య చేసుకోవటం ప్రతి ఒక్కరినీ చలింప చేసిందన్నారు. కారంపూడి మండలానికి చెందిన రాజా పాస్‌పుస్తకంకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసుగెత్తి ఆత్మహత్యకు అల్టిమేటం జారీచేశాడని గుర్తుచేశారు. ఇలా చెప్పుకుంటే వందలాది మంది అన్నదాతలు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. విలేకర్ల సమావేశంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమి కమల్, పార్టీ నాయకులు గులాం రసూల్, అడుసుమల్లి ప్రతాప్, మంత్రి మహానంది, తదితరులు పాల్గొన్నారు.