గుంటూరు

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదనందిపాడు, జనవరి 23: రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని రోడ్డు రవాణాశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఆత్మస్థయిర్యంతో అభివృద్ధికి అహర్నిశలు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. పెదనందిపాడు మండలం నాగులపాడులో మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్నవారికి భవిష్యత్తు ఉంటుందని, అందుకు తానే తార్కాణమన్నారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుల సారధ్యంలో మంత్రి పదవిని నిర్వహించటం తనకే దక్కిందన్నారు. దేశంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌లు మాస్ లీడర్లని వారు ఎన్నికల్లో ఓటమి చూసినప్పటికీ ఎప్పటికీ జనం గుండెల్లో పదిలంగా ఉంటారన్నారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో 16వేల 500 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకువెళుతున్న ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ మూర్ఖుడని, ఆయన సీఎం అయితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని విమర్శించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చరిత్ర గర్వించే విధంగా రాష్ట్భ్రావృద్ధి జరుగుతుందని చెప్పారు. జూట్ విత్తనాల గురించి ముఖ్యమంత్రితో చర్చించి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. చంద్రన్న దళితబాట పెట్టిన ఘనత రావెల కిషోర్‌బాబుకు దక్కిందన్నారు. మరో మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆస్వాదిస్తున్నారని చెప్పారు. అడుగడుగునా సైంధవుడులా అడ్డుపడుతున్న జగన్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో సమస్యలు సహజమన్నారు. నాయకుల మధ్య సమస్యలు ఉంటే సర్దుకు పోదాం..ఐక్యతతో మెలగాలని తమ్ముళ్లకు హితవు పలికారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ ప్రజలిచ్చిన అధికారమే తెలుగుదేశం పార్టీ బలమన్నారు. సభలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, జడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ జన్మదినం సందర్భంగా మంత్రులు కేక్ కట్‌చేశారు.

ఉపరాష్టప్రతి పర్యటన ఏర్పాట్లపై వీడిన ఉత్కంఠ

పెదనందిపాడు, జనవరి 23: ఉపరాష్టప్రతి పర్యటన నిమిత్తం కలెక్టర్ కోన శశిధర్ హెలీపాడ్ స్థలాలను ఖరారుచేశారు. ఇప్పటి వరకు స్థల నిర్ణయంపై కింది స్థాయి అధికారులు వెలిబుచ్చుతున్న సందేహాలకు కలెక్టర్ తెరదించారు. ఫిబ్రవరి 3వ తేదీన భారత ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్వర్ణోత్సవాలకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఒకే ప్రాంతంలో మూడు హెలీపాడ్‌లను నిర్మించాల్సి రావడంతో శాఖల మధ్య కొరవడిన సమన్వయం వల్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ పెదనందిపాడు, ప్రత్తిపాడు, కాకుమాను ప్రాంతాల్లో స్థలానే్వషణ చేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా సోమవారం రాత్రి ఈ ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ వెంకటప్పలనాయుడు మంగళవారం పెదనందిపాడు చేరుకుని నల్లమడ వాగుకు దక్షిణంవైపున ఉన్న దేవాదాయ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుండి నాగులపాడులో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాక సందర్భంగా ఏర్పాటుచేసిన హెలీపాడ్‌ను పరిశీలించి ఇక్కడే రెండు హెలీపాడ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మూడవ హెలీపాడ్‌ను కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య పాలకవర్గ అధ్యక్షులు కాళహస్తి సత్యనారాయణ, జెసి2 ముంగా వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ మాధవీ సుకన్య, ఆర్డీవో బీ శ్రీనివాసరావు, సీఈఒ నాగార్జునసాగర్, విద్యుత్ ఎస్‌ఈ జయభారత్‌రావుతో పాటు తహశీల్దారు మోహన్‌రావు, ఎంపీడీఒ ఖాజాబీ, ఎంపీపీ నాగరాజకుమారి, అంకమ్మచౌదరి తదితరులు చర్చించారు.