గుంటూరు

హోదాపై కేంద్ర, రాష్ట్రాల దోబూచులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 20: ప్రత్యేక హోదా విషయంలో ఇటు రాష్ట్రంలోని తెలుగుదేశం, అటు దేశంలోని బీజేపీ దోబూచులాడుతున్నాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ ఎద్దేవాచేశారు. మంగళవారం అరండల్‌పేట 8వ లైను మెయిన్‌రోడ్డుపై నగర వైసీపీ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్షను బొత్స ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయని, తద్వారా ఉద్యోగ ఉపాధి కలిగి రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతుందన్నారు. హోదా ఆవశ్యకతను అధికార టీడీపీ విస్మరిస్తే అనుభవం కలిగిన విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వంపై పోరుబాటకు దిగడం విజయ సూచికమన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతున్నా కేంద్రాన్ని ప్రశ్నించని తెలుగుదేశం పార్టీ నేడు ప్రజలను మరోమారు మభ్యపెట్టేందుకు సరికొత్త పన్నాగాలందుకుందని బొత్స ధ్వజమెత్తారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పార్లమెంటరీ సమన్వయకర్త లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ మనీ, మద్యానే్న నమ్ముకున్న తెలుగుదేశం ప్రభుత్వానికి మనుషుల విలువలు, విశ్వసనీయత ఏం తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల మద్దతుతో నిర్విరామ పోరాటాలకు నాంది పలికారన్నారు. ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడమే టీడీపీ పనిగా పెట్టుకుందన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా సాధన కోసం కృషిచేయక పోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రత్యేక హోదాను సాధించుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఈచంపాటి వెంకటకృష్ణ, లక్కాకుల థామస్‌నాయుడు, నాయకులు గులాం రసూల్, బందా రవీంద్రనాథ్, కొలకలూరి కోటేశ్వరరావు, మేడా సాంబశివరావు, దేవరాజ్, తుమ్మేటి శ్రీను, బ్రహ్మానందరెడ్డి, హరి, ఆర్ నరసింహమూర్తి, సత్యనారాయణరెడ్డి, ఎన్ ప్రభాకర్, అంబేద్కర్, బాబు, కేంద్ర, రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.