గుంటూరు

నేర నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 23: నేర నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం తప్పని సరని గుంటూరు రేంజి ఐజీ కెవివి గోపాలరావు అన్నారు. రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన ‘చేతన’ వాహనాలను ఐజీతో పాటు కలెక్టర్ కోన శశిధర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ మణి పల్వేశన్, అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు శుక్రవారం సాయంత్రం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ గోపాలరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కొందరు నేరస్తులు మోసాలకు తెగబడుతూ ప్రజలను వేధిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వివిధ మోసాలపై గ్రామీణ ప్రజలను చైతన్య పరిచేందుకు చేతన ఉపకరిస్తుందని చెప్పారు. ఈ వాహనం ద్వారా లఘుచిత్రాల ప్రదర్శనతో మోసాలను అరికట్టే విధంగా ఏర్పాటు చేయటం రాష్ట్రంలోనే తొలిసారి అన్నారు. రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు మాట్లాడుతూ దేశంలో సగం వరకు నేరాలు ప్రజల అమాయకత్వం వల్లే జరుగుతున్నాయని వివరించారు. తెలియక చేసిన తప్పులకు మూల్యం చెల్లించిన వారనేక మంది ఉన్నారని, అప్రమత్తంగా వ్యవహరించక పోవటం వల్ల డబ్బు, ఆస్తి, చివరకు ప్రాణాలు సైతం కోల్పోయిన వారు ఉన్నారని వివరించారు. ఈ నేపథ్యంలో నేరాల గురించి సవివరంగా లఘుచిత్రాలను ప్రదర్శించి ప్రజలకు వివరించడంతో పాటు అప్రమత్తతో వ్యవహరించే మార్గాలను సూచించటమే చేతన లక్ష్యమన్నారు. లఘుచిత్రాల్లో క్రికెట్ బెట్టింగ్‌లు, మట్కా, జూదం వంటి వ్యసనాలకు బానిస కాకుండా జాగ్రత్తలు సూచించటం, సైబర్ నేరాలు డెబిట్, క్రెడిట్‌కార్డులు, ఆన్‌లైన్ మోసాలు, అపరిచిత వ్యక్తుల బారినపడి మోసపోకుండా మెళకువలు నేర్పాలనేది సారాంశంగా చెప్పారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించటం ద్వారా విలువైన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలనేది కూడా లఘుచిత్ర ప్రదర్శనలో ఉంటుందని తెలిపారు. ప్రజలు పోలీసు వ్యవస్థకు సహకారం అందించడం ద్వారా నేరాలను నియంత్రించే వీలు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని పలువురు డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.