గుంటూరు

నగరాభివృద్ధికి రూ. 160 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కార్పొరేషన్), మే 10: గుంటూరు నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సుమారు 160 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. మంగళవారం ఉదయం నగర పరిధిలోని 2వ డివిజన్ రజక కాలనీలో 52 లక్షల రూపాయలతో చేపట్టనున్న రహదారులు, కాల్వల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ రానున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామన్నారు. నగర ప్రజలకు భవిష్యత్తులో మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని, మంచినీటి సమస్యను అరికట్టేందుకు ఎలాంటి నిధుల కొరత లేదని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని మంచినీటి, వౌలిక సదుపాయాల కల్పనకై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. అనంతరం 3వ డివిజన్ షాప్ ఎంప్లాయిస్ కాలనీ, పొన్నూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చినరాజప్ప పరిశీలించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు జివి ఆంజనేయులు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, మహ్మద్ ముస్త్ఫా, టిడిపి తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దాళి గిరిధర్, షేక్ షౌకత్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మద్దాళి గిరి అనుచరుల ఆందోళన...
తొలుత 2వ డివిజన్ రజక కాలనీలో 52 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటుచేసిన శిలాఫలకంపై తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దాళి గిరిధర్ పేరు పొందుపర్చక పోవడంపై ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తంచేశారు. తూర్పు నియోజకవర్గంలో మద్దాళి గిరి ఆధ్వర్యంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ కనీసం శిలాఫలకాలపైనా ఆయన పేరును చేర్చకపోవడం దారుణమంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మిని ఘొరావ్ చేస్తూ, డౌన్ డౌన్ కమిషనర్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ విషయం మరింత ముదరకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు జోక్యం చేసుకుని వారిని సముదాయించారు. కమిషనర్ నాగలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము ప్రొటోకాల్‌ను అనుసరించి శిలాఫలకాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు.