గుంటూరు

రెంటచింతలలో గాలివాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెంటచింతల, మే 10: రెంటచింతలలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆంజనేయ స్వామివారి మాన్యంలో కొన్ని ఇళ్ళకు ఇంటి పైకప్పు రేకులు లేచిపోగా, పెద్ద చెట్లు గాలిథాటికి కూలిపోయాయి. ఈ గాలివాన వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మండలంలోని కరెంట్ స్తంభాలు 20పైగా నేలకూలి విద్యుత్‌కు అంతరాయం కలిగింది. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ శాఖాధికారులకు సుమారు నాలుగు లక్షల రూపాయల నష్టం వచ్చినట్లు విద్యుత్ ఏఈ కోటయ్య మంగళవారం తెలిపారు. వర్షపాతం 4.6 సెంటీమీటర్లు నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.