గుంటూరు

అంగరంగ వైభవంగా ఆదికేశవుని శాంతికల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, మార్చి 22: త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ భూ సమేత ఆదికేశవస్వామి వార్షిక శాంతికల్యాణం ఆలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఫణిహారం శ్రీ్ధర్ నేతృత్వంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. అందమైన కేశములు కలిగిన ఆదికేశవ స్వామి వార్షిక శాంతికల్యాణం గత ఐదు దశాబ్దాలుగా జరగుతోంది. ఈ నేపథ్యంలో చేబ్రోలులోని అతిపురాతనమైన ఆదికేశవస్వామి దేవాలయంలో శాంతికల్యాణం నిర్వహించారు. సాధారణంగా శ్రీమహావిష్ణువు కుడిచేతితో చక్రం, ఎడమచేతిలో శంఖం ఉం టుంది. అయితే ఇక్కడి ఆదికేశవస్వామి దేవాలయంలో స్వామివారి కుడిచేతిలో శంఖం, ఎడమచేతిలో చక్రం ఉండటం విశేషం. ఒకప్పుడు శ తోట్లవల్లూరు నుంచి ఏనుగులు అంబారీలతో వచ్చాయి. కల్యాణాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు. దాత వాసుదేవమూర్తి దంపతుల చేతుల మీదుగా స్వామివారి కల్యాణాన్ని యాజ్ఞికులు, రుత్విక్కులైన ఫణిహారం కళాధర్, నరసింహమూర్తి, వాసుదేవభట్కర్‌లు నిర్వహించారు. స్వామివారి కల్యాణం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంపూర్ణ అక్షరాస్యత సాధనకు సహకరించాలి
అమరావతి, మార్చి 22: మండలాన్ని అక్షర క్రమంలోనే కాకుండా అక్షరాస్యతాక్రమంలో కూడా ముందు వరుసలో నిలిపేవిధంగా సాక్షరభారత్ గ్రామ కోఆర్డినేటర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎండిఒ వై రాజగోపాల్ కోరా రు. మంగళవారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన సా క్షర భారత్ గ్రామ కో ఆర్డినేటర్ల సమావేశానికి మండల కో ఆర్డినేటర్ నందం నరేంద్ర అధ్యక్షత వహించారు. ఎండిఒ రాజగోపాల్ మాట్లాడుతూ డ్వాక్రా, మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులందరూ అక్షరాస్యులయ్యేలా వయోజన కేంద్రాలను విద్యా కేంద్రాలను నిర్వహించాలని సూచించారు. తహశీల్దార్ నాసరయ్య మాట్లాడుతూ సంపూర్ణ అక్షరాస్యత సాధనలో పాల్గొన్న వాలంటీర్లకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఇఒపిఆర్‌డి పెండ్యాల శివరామయ్య, మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పెనుముచ్చు రామకృష్ణ, షేక్ జాని, షేక్ మాబు సుభాని, వాణీనాథ్ తదితరులు పాల్గొన్నారు. సాక్షరభారత్ గ్రామ కో ఆర్డినేటర్లకు ప్రభుత్వం పంపిన కుట్టుమిషన్, సోలార్‌ల్యాంప్, అక్షరమాల చార్ట్‌లు వేయింగ్‌మిషన్, బ్లాక్‌బోర్డ్, మ్యాప్‌లను పంపిణీచేశారు.