గుంటూరు

ప్రభుత్వ వైద్యశాలల్లో పెరిగిన ఓపి సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 22: ప్రభుత్వ వైద్యశాలల్లో గతంలో కంటే అవుట్ పేషంట్ల సంఖ్య అధికమైందని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు మెడికల్ కళాశాల జింఖానా ఆడిటోరియంలో ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లారుూస్ అసోసియేషన్ ఆవిర్భావ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన పూనం మాలకొండయ్య మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు తమ వృత్తినైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. వైద్యారోగ్యశాఖలో ఇటీవల 6 వేల మంది వైద్యులు, సిబ్బందిని నియమించామని, త్వరలో మిగిలిన ఖాళీలు భర్తీచేస్తామని చెప్పారు. ఎఎన్‌ఎంలపై పనిభారం తగ్గించేందుకు అన్న ట్యాబ్‌ల స్థానంలో కొత్త సాఫ్ట్‌వేర్‌తో నూతన ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వైద్యారోగ్యశాఖలో ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ దుర్గాప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సేవలు అందించడంలో నర్సుల పాత్ర ఎనలేనిదన్నారు. ప్రభుత్వం కూడా వైద్యరంగానికి అధిక నిధులు వెచ్చిస్తుందన్నారు. సమావేశంలో పలు సంఘాల నాయకులు ఎన్ చంద్రశేఖరరెడ్డి, షేక్ బాజిత్, సిహెచ్ రాంబాబు, సుకుమార్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం మెడలువంచైనా హోదా సాధిస్తాం
గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 22: కేంద్రప్రభుత్వం మెడలు వంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు స్పష్టంచేశారు. ఆదివారం గుంటూరు రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు యర్రంశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా కోరుతూ నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న రావెల మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న 18 అంశాల అమలులో కేంద్రం మొండి వైఖరి వీడాలన్నారు. రాష్ట్భ్రావృద్ధి కోసమే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్ని విధాలా అన్యాయం చేస్తున్నా సహించిన చంద్రబాబు ప్రజాభీష్టం మేరకే కేంద్రమంత్రివర్గం నుండి వైదొలిగి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్నారన్నారు. యర్రంశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజు నాడు కూడా 12 గంటల పాటు హోదా కోసం దీక్ష చేపడితే ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి విమర్శలు చేయడం అయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. గల్లీలో బీజేపీని విమర్శిస్తూ ఢిల్లీలో మాత్రం వైసీపీ నాయకులు మిలాఖత్ అవుతున్నారన్నారు. తమ ఎంపీల చేత రాజీనామా చేయించిన జగన్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేత ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ విమర్శలు మాని హోదా కోసం చిత్తశుద్ధితో ఉద్యమించాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మార్కెట్‌యార్డు డైరెక్టర్ తాళ్ల నాగరాజు, యర్రంశెట్టి విజయ్, ఇమ్మడి వెంకటేశ్వర్లు, శేషం ఏడుకొండలు, చిల్లర విజయకిషోర్, కల్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.