గుంటూరు

హోదా సాధనకోసమే సైకిల్ యాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, ఏప్రిల్ 22:విభజిత ఆంధ్రప్రదేశ్‌కు హోదా సాధనే లక్ష్యంగా ప్రతి రోజు అన్ని నియోజకవర్గావల్లో మూడు గంటల పాటు సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నామని స్థానిక స్పీకర్ కార్యాలయంలో ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. ఈ నెల 30న తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించనున్నారని అన్నారు. మే 30న తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడును విజయవాడ-గుంటూరు మధ్య నిర్వహించాలని సమన్వయ కమిటీలో చర్చించడం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో నేరుగా ఢీకొనే నాయకుడు ఒక్క చంద్రబాబే అన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 20 రోజుల వరకు సైకిల్ ర్యాలీలు నిర్వహించి ప్రత్యేక హోదాపై ప్రచారం చేస్తున్నామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ షేక్ జానిమూన్, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్‌కుమార్, తెనాలి శాసన సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, నియోజకవర్గ ఎన్‌చార్జిలు మద్దలి గిరిధర్, గంజి చిరంజీవి (మంగళగిరి) కొమ్మారెడ్డి చలమారెడ్డి (మాచార్ల) జిల్లా ప్రధాన కార్యదర్శి లాల్ వజీర్, నాగార్జునసాగర్ ప్రజెక్టు కమీటీ చైర్మన్ జివివి రాయల్, సత్తెనపల్లి నియోజకవర్గ యువనాయకులు డాక్టర్ కోడెల శివరామ్, గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.

హోదా హామీ నిలబెట్టుకోకుంటే ఢిల్లీ పీఠం కదిలిస్తాం
అచ్చంపేట, ఏప్రిల్ 22: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా, విభజన హామీలను నెర్చవేర్చకుంటే ఆంధ్రులు ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తారని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అన్నారు. మండలంలోని వేల్పూరు గ్రామంలో విలేఖర్లతో మాట్లాడుతూ కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దీంతోపాటుగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కపట ప్రేమను చూపిస్తున్న కేంద్రప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామన్నారు. నరేంద్రమోదీకి రాష్ట్రప్రజలు ముచ్చెమటలు పట్టించే సమయం ఆసన్నమైందన్నారు. విభజన హామలను సాధించుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రజలతో కలిసి పోరాడుతుందన్నారు. ఆంధ్రాపై కుట్రలు చేస్తున్న బీజేపికి బుద్ధిచెప్పాలన్నారు. ధర్మపోరాట దీక్షతో ప్రభుత్వం ఢిల్లీపై ఉద్యమ పోరాటానికి తెరలేపిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎన్ వెంకటేశ్వరరావు, పివి రామారావు, ఆశీర్వాదం, వేగుంట రాణి, నలజాల సదాశివరావు, పెద్దబాబు, అరుణ్, బత్తుల శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణగౌడ్, ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.