గుంటూరు

ఆంధ్రులను నట్టేట ముంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 24: ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రరాష్ట్రాన్ని అంధకారంలో నెడుతున్నారని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం రెండూ కలిసి ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేస్తున్నాయని, ప్రత్యేక హోదా సాధన సమితి, వివిధ రాజకీయపార్టీల నాయకులు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా మంగళవారం రాత్రి వివిధ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు వెళ్లి విద్యుత్ నిలిపివేయించి నిరసన తెలిపారు. ముందుగా శంకర్‌విలాస్ నుండి ర్యాలీగా బయలుదేరి లాడ్జిసెంటర్, అమరావతి రోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, కాంగ్రెస్ నాయకులు సవరం రోహిత్, హోదా సాధన సమితి నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమాలు చేస్తామని చెప్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన, బంద్‌లపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఐకమత్యంతో కేంద్రంపై పోరాడాల్సిన సమయంలో తెలుగుదేశం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మోసపూరిత దీక్షలు మానుకుని, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కృషిచేయాలని కోరారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ప్రత్యేక హోదా ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కె నాగేశ్వరరావు, ఎన్ భావన్నారాయణ, బి లక్ష్మణరావు, అజయ్‌కుమార్, జనసేన నాయకులు బేతంచర్ల శ్రీనివాసరావు, ఐలవరం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకుడు సురేష్, సీపీఐ నాయకులు అమీర్, నూతలపాటి చిన్న, వెంకటేశ్వరరెడ్డి, ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు చిష్టి తదితరులు పాల్గొన్నారు.