గుంటూరు

మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదనందిపాడు, ఏప్రిల్ 24: పెసలు, మినుములు కొనుగోలు కేంద్రాన్ని జిల్లావ్యాప్తంగా త్వరలో ప్రారంభించనున్నట్లు ఏపి మార్క్‌ఫెడ్ మేనేజర్ కరుణ తెలిపారు. పెదనందిపాడు ఉప మార్కెట్‌లో గల శనగల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 27,585 క్వింటాళ్ల శనగలను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. పెదనందిపాడు యార్డులో 6,850 క్వింటాళ్లు కొనుగోలు చేశామన్నారు. రైతులకు త్వరలో నగదు చెల్లించడం జరుగుతుందని చెప్పారు. 6 వేల టన్నుల శనగల కొనుగోలును లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయని రైతులు త్వరపడి పంటను అమ్ముకోవాలని సూచించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయడమే తమ లక్ష్యమన్నారు. మార్కెటింగ్ జిల్లా అధికారిణి నళినీ, కొనుగోలు కేంద్రం అధికారి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు
గౌరవ వేతనాల పంపిణీ
కాకుమాను, ఏప్రిల్ 24: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం విడుదల చేసిన గౌరవ వేతనాలను ఎంపీపీ నక్కల శైలజ మంగళవారం పంపిణీ చేశారు. మండల పరిధిలోని 31 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత, 6 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న మొ త్తం 44 మంది కార్మికులకు 2017- 18 విద్యా సంవత్సరానికి రూ 5,69,250 వెలుగు కార్యాలయ ఏపిఎం సంతోష్, పిహెచ్‌సి కమిటీ చైర్మన్ నక్కల అగస్టీన్‌లు, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పంపిణీ చేశారు.

చేబ్రోలు పంచాయతీకి జిల్లా స్థాయి అవార్డు
చేబ్రోలు, ఏప్రిల్ 24: నూరు వసంతాలకు పైగా ఘనచరిత్ర కల్గి జిల్లాలోని పంచాయతీలలో కెల్లా అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిపెడుతూ, గ్రామ పంచాయతీ స్థాయి నుంచి నగర పంచాయతీ స్థాయికి ఎదిగిన మండల కేంద్రమైన చేబ్రోలు గ్రామ పంచాయతీకి జిల్లా స్థాయి అవార్డు లభించింది. చేబ్రోలు పంచాయతీ కార్యదర్శి కె శ్రీనివాసరావు నేతృత్వంలో చేబ్రోలులో సుమారు 22 లక్షల రూపాయలతో ఘన, వ్యర్థ పదార్థాల సంపద కేంద్రాన్ని నిర్మించడమే కాక గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించినందుకు ఈ అరుదైన అవార్డు లభించింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళవారం సర్పంచ్ నాగమల్లేశ్వరికి ఈ అవార్డును జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, ఇతర జిల్లా స్థాయి అధికారులు అందజేశారు. జిల్లా స్థాయి అవార్డు లభించినందుకు చేబ్రోలు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావును పలువురు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అభినందించారు.