గుంటూరు

కేంద్రం అన్యాయాన్ని తెలిపేందుకే సైకిల్ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భట్టిప్రోలు, ఏప్రిల్ 24: కేంద్ర ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలిపేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి సైకిల్ యాత్రలకు పిలుపు నిచ్చారని గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. అక్కివారి పాలెం గ్రామంలో మంగళవారం ఉదయం టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన సైకిల్ యాత్రను ఆనందబాబు ప్రారంభించారు. అక్కివారి పాలెం, పెదపులివర్రు, గౌడపాలెం, జిలుగు వారిపాలెం గ్రామాలలో సైకిల్ తొక్కుతూ మంత్రి ప్రజలను కలుసుకుంటూ ముందుకు వెళ్ళగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట అనుసరించారు. పెదపులివర్రులో నాదెండ్ల నందారావుఅనే సీనియర్ టీడీపీ నాయకుడు అనారోగ్యానికి గురైనట్లు తెలుసుకున్న మంత్రి ఆయన వద్దకు వెళ్ళి పరామర్శించారు. అలాగే ఇటీవల కాలంలో వివిధ ప్రమాదాలలో మృతి చెందినవారి కుటుంబీకులను పరామర్శించారు. వెల్లటూరు చేరుకున్న సైకిల్ యాత్ర గ్రామంలో కూడా ఎండను సైతం లెక్కచేయక యాత్ర నిర్వహించారు. వెల్లటూరు సెంటర్ వద్ద జరిగిన సభలో ఆనందబాబు మాట్లాడుతూ తిరుపతి వెంకన్న సాక్షిగా ఎన్నికల ప్రచార సభలో ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసిన మోదీ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలిపేందుకు ఈ నెల 30న అదే వేదిక స్థలం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్భ్రావృధ్ధికి వైకాపా శాపంగా మారిందన్నారు. వైసీపీ నుండి 50మంది యువకులు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రాగా వారిని కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ,యార్డ్ చైర్మన్ జొన్నల గడ్డ విజయబాబు, జీడీసీసీబీ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, మండలపార్టీ అధ్యక్షుడు వై కె శ్రీనివాసరావు,యంపీపీ వాకా సుధ, మండల ఉపాధ్యక్షుడు కె సుందరరావు, యంపీటీసీ కృష్ణకుమారి, కృష్ణాడిస్ట్రిబ్యూటరీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ, నాయకులు జగన్నాధరావు, చినబాబు, సాయిబాబా, జంగం శ్యాంసన్,అబ్దుల్లాబేగ్, ఇబ్రహీంబేగ్ , అత్తలూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.