గుంటూరు

పార్కులను పరిశుభ్రంగా ఉంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 26: నగర వాసులకు ఆహ్లాదాన్ని పంచే పార్కులను పరిశుభ్రంగా ఉంచి అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ శ్యామలానగర్, గుజ్జనగుండ్ల, జేకేసీ కళాశాలరోడ్డు, ఇన్నర్‌రింగు రోడ్డు, అమరావతి రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు, మంచినీటి సరఫరా, ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించారు. ఈ సందర్భంగా శ్యామలానగర్ పార్కు వద్ద నూతనంగా నిర్మించిన రిజర్వాయర్‌ను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. అక్కడే పార్కును పరిశీలించిన కమిషనర్ పార్కు చుట్టూ ప్రహరీగోడ నిర్మించి అభివృద్ధి చేయాలన్నారు. పార్కు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్, ప్రజారోగ్యశాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదార్లపై చెత్తకుప్పలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, అదే సమయంలో సైడ్ కాల్వల్లోని షిల్టును తొలగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కమిషనర్ వెంట సిటీ ప్లానర్ చక్రపాణి, డీఈ రమేష్‌బాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

చంద్రన్న పెళ్లికానుక అందజేత
అమరావతి, ఏప్రిల్ 26: మండల పరిధిలోని వైకుంఠపురం గ్రామంలో గురువారం వివాహం చేసుకున్న శానం రామారావు, గుడిమెట్ల ఉమాదేవి దంపతులకు చంద్రన్న పెళ్లికానుక సొమ్ము రూ 40వేలు గ్రామ సర్పంచ్ తోకల వెంకటేశ్వర రావు, ఎంపీటీసీ బండ్ల సుమతి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏబీఎం రమాదేవి, కళ్యాణ మిత్రలు షేక్ ఫాతిమా, షేక్ బీబులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కె వసంతరావు, షేక్ జానీ, సీహెచ్ శౌరయ్య, బండ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.