గుంటూరు

రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వాలు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 26: రైతులను ఆదుకోవటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు రావి వెంకటరమణ విమర్శించారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటుధర లేకపోవటంతో అన్నదాతలు ఆర్ధికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం పాలకులు రాజకీయాలు తప్ప అన్నదాతల గురించి ఆలోచించిన దాఖలాలులేవని విమర్శించారు. ఓ పక్క పంట నిల్వలు పేరుకుపోతున్నా సరిపోను గోదాములు లేకపోవటంతో నష్టానికే సరకును రైతులు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పెట్టుబడికి తగిన ఆదాయం వచ్చే పరిస్థితి లేకపోవటంతో రైతులు తల్లడిల్లిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లాలో రెండవ పంట కింద పండించిన మినుము, సెనగ, మొక్కజొన్న, జొన్న పంటలకు గిట్టుబాటుధర లేదన్నారు. పేరుకే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, అక్కడ ఒక క్వింటాల్ సరుకు కూడా కొనుగోలు చేయటంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లుతెరచి రాజకీయాలు మానుకుని అన్నదాతల కష్టాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని రైతులతో కలసి ఉద్యమబాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.