గుంటూరు

సప్తస్వర సంగీత సంగమం వీణాపాణి అవధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఏప్రిల్ 26: నాటకురంజి.. యమన్‌కళ్యాణి.. మోహ న.. కళ్యాణి.. సింధుభైరవి.. శ్రీరా గం.. తదితర రాగాలలో అప్పటికప్పుడు వేదికపై నుంచి సభా పూర్వకంగా పృ చ్ఛకులు అడిగిన సాహిత్యానికి అనుగుణంగా, అలవోకగా జనరంజకమైన రాగాలను మేళవిస్తూ పలు స్వీయ సాహిత్య కృతులను, కీర్తనలను ఆలపించి తన మహా అవధానాన్ని సప్తస్వర సంగీత సంగమం చేశారు సినీ సంగీత దర్శకుడు స్వర వీణాపాణి. ఈ కళాకారుడి సప్తస్వర మహావధానాన్ని బృందావన వెంకన్న ఆలయం, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్, శ్రీ త్రివిక్రమ అగస్త్యేశ్వర స్వామి భక్తబృందం చెరుకూరు వారి సౌజన్యంతో కళాభిమానుల సమక్షాన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వర వీణాపాణి 72 మేళకర్త రాగాల మాలికలో 40 అపూర్వ (వివాది) రాగాలను ఎంచుకుని పృచ్ఛకులు సంధించిన సాహిత్యానికి అనుగుణంగా తనదైన బాణీలతో స్వరంతో గీతాలను ఆలపించి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఈ మహావధానం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగింది. వెంకన్న ఆలయ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతిప్రజ్వలన చేశారు. భారతుల రామకృష్ణ, దాసరి చంద్రశేఖర్ అవధానాన్ని పర్యవేక్షించారు. అతిథులుగా వచ్చిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు డీవీ మోహనకృష్ణ ప్రసంగిస్తూ సప్తస్వర మహావధానం ఓ వినూత్న ఒరవడిలో కొనసాగిందన్నారు. వీణాపాణి తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ మహామహులైన వాగ్గేయకారులకు రాగాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం కావించడం శుభదాయకమన్నారు. గౌరవ అతిథి, గుంటూరు మార్కెట్‌యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ సంగీత సాహిత్యాలు మరీ ముఖ్యంగా సంగీతం, గానం లలిత కళలన్నింటిలో విశేషమైన కళాప్రక్రియ అని, శ్రోతల మదిని ఊయలలూగిస్తూనే ఉంటుందన్నారు. నగర వాసి అయిన వీణాపాణి సంగీత దర్శకునిగా కొత్త ప్రయోగాలుచేసి సినిమా పరిశ్రమలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని సుబ్బారావు అభినందించారు. అతిథులుగా హాజరైన ప్రముఖులంతా స్వరవీణాపాణి బృందావన వెంకన్న పాదాలచెంత ఈ మహావధానం స్వయంగా నిర్వహించడం అత్యంత ముదావహమన్నారు. సభలో భాగంగా వీణాపాణిని అతిథులు నిర్వాహకుల పక్షాన ఘనంగా సత్కరించారు. తనను ప్రోత్సహిస్తూ సహాయ, సహకారాలు అందిస్తున్న కళాప్రియులకు, కళా సంస్థల ప్రతినిధులకు ప్రధానంగా గర్తపురి వాసులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని వీణాపాణి ధన్యవాదాలు తెలిపారు.