గుంటూరు

రైతులను ఇబ్బందులు పెట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్లూరు, మే 12: రాజధానికి భూములిచ్చిన రైతులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టవద్దని మాజీ ఎంపిపి మల్లెల హరీంద్రనాథ్ చౌదరి కోరారు. రాయపూడిలో గురువారం కొండంరాజుపాలెం రైతులకు భూ సేకరణపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెల మాట్లాడుతూ రాజధాని ప్రకటన సమయంలో వెదురుబొంగుల అగ్నిప్రమాదం కేసులో కొండెపాటి శ్రీనాథచౌదరి అనే రైతుపై కేసు బనాయించారని, ఆ రైతు ఏడాదిన్నర కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. కేసు ఎత్తివేస్తామని జాయింట్ కలెక్టర్ ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. ప్లాట్ల కేటాయింపుపై గడువుపెంచిన విషయాన్ని అధికారులు రైతులకు మెసేజ్ పంపడం లేదని ఒక రైతు తెలిపారు. సిఆర్‌డిఎ అధికారుల పనితీరుపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తక్షణ పరిష్కారం తమ చేతుల్లో లేదని సిఆర్‌డిఎ డైరెక్టర్ రహంతుల్లా సమాధానమిచ్చారు. కార్యక్రమంలో సామాజిక శాస్తవ్రేత్త సునీత, డెప్యూటీ కలెక్టర్ దొర, తహశీల్దార్ సుజాత పాల్గొన్నారు.