గుంటూరు

ముగిసిన అఖిల భారత నాటకోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భట్టిప్రోలు, ఏప్రిల్ 30: మండలంలోని పల్లెకోన గ్రామంలో నందమూరు తారకరామారావు కళాప్రాంగణంలో రఘబాబు టియస్‌ఆర్ లలితకళా పరిషత్ కళామండపంలో నాలుగు రోజులుగా జరుగుతున్న పరుచూరి రఘబాబు స్మారక 28వ అఖిల భారత నాటకోత్సవాలు సోమవారం రాత్రి జరిగన ప్రదర్శనలతో ముగిశాయి. ఆహ్లాద కరంగా జరిగిన ఈ పోటీలలో చివరి రోజు మొదటి ప్రదర్శనగా జరిగిన మణికంఠ ఆర్ట్స్ కొండెవరం వారి బంధాల బరువెంత నాటికను చెలికాని వెంకటరావు దర్శకత్వంలో జాస్తి రమాదేవి రచనను నటీనటులతో ప్రేక్షకులను రంజింపజేశారు. రెండవ ప్రదర్శనగా తెలుగు కళాసమితి విశాఖపట్నం వారి కుక్కపిల్ల నాటికను బారాతుల రామకృష్ణ రచనను గోపరాజు విజయ్ దర్శకత్వంలో ప్రదర్శించారు. మూడవ ప్రదర్శనగా సిరిమువ్వ కల్చరల్స్ హైదరాబాదు వారి కల్లందిబ్బ నాటికను భజరప్ప దర్శకత్వంలో రావినూతల ప్రేమకిషోర్ రచనను ప్రదర్శించారు. అనంతరం సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నాలుగు రోజులుగా నాటకోత్సవాలను తిలకించి ప్రోత్సాహం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు తెలంగాణాలోని ఖమ్మంలో కూడా 8 నాటకాలు, 6 నాటికలు ప్రదర్శింప బడతాయని, న్యాయ నిర్ణేతల సూచనల మేరకు అక్కడ జరిగే ముగింపు సభలో నటీ నటులకు ప్రోత్సాహక బహుమతులు, ఉత్తమప్రదర్శనలు, ఉత్తమ నటీనటులకు బహుమతులు అందించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు రవీంద్రనాథ్, సర్పంచ్ రాయన ప్రసాద్, ట్రస్టీ బసవపున్నారావు, వేములపల్లి సుబ్బారావు, సాం బశివరావు తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
అచ్చంపేట, ఏప్రిల్ 30: నిర్ధారించిన వివాహ వయస్సు నిండకుండా పిల్లలకు వివాహాలు జరిపిస్తే తల్లిదండ్రులు, ప్రోత్సాహకులపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని ఐసిడిఎస్ సూపర్‌వైజర్ సింహాచలం తెలియజేశారు. బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కల్పిస్తూ సోమవారం అచ్చంపేట 3వ అంగన్‌వాడీ సెక్టార్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతికి 18, యువకుడికి 21 సంవత్సరాలు నిండే వరకు వివాహం జరిపించరాదని చెప్పారు. అతిక్రమించిన వారిపై లక్ష రూపాయల వరకు జరిమానా కూడా ప్రభుత్వం విధిస్తుందని హెచ్చరించారు. ర్యాలీలో అంగన్‌వాడీ టీచర్లు, బాలికలు ఉన్నారు.