గుంటూరు

బస్సు షెల్టర్ నిర్మాణానికి ‘స్నేహహస్తం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, మే 22: సర్కారీ బడులు, గ్రామాల అభివృద్ధికి స్నేహహస్తాల ఫౌండేషన్ అందిస్తున్న సహకారం అభినందనీయమని ప్రముఖ వైద్యుడు మామిళ్లపల్లి మధుసూదనరావు సతీమణి మామిళ్లపల్లి విజయలక్ష్మి అన్నారు. మంగళవారం అచ్చంపేట, వేల్పూరు గ్రామాల మధ్య రోకలిగుంటవారిపాలెం అడ్డరోడ్డు వద్ద బస్సు షెల్టర్ నిర్మాణానికి స్నేహహస్తాల నుండి అందిన లక్ష రూపాయల చెక్కును ఆమె గ్రామ సర్పంచ్ డి ఎలిజబెత్‌రాణి గంగయ్యకు అందజేశారు. గతంలో గ్రామస్థులు బస్ షెల్టర్ నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని స్నేహహస్తాల ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో స్నేహహస్తాల ప్రతినిధులు తుమ్మా శౌరిరెడ్డి, మనె్నం భద్రయ్య, కో-ఆర్డినేటర్ తాయి కరిముల్లా, నూకంరాజు, సుందరరావు, డి శ్రీను, ఎస్ శ్రీను, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యత
పొన్నూరు, మే 22: రైతాంగ శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి సాగునీరు, ఎరువుల కొరత లేకుండా చేయడంతో ఉత్పత్తులు గణనీయంగా పెరిగి రైతులు సంతోషంగా ఉన్నారు. పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సంకల్పించిన ప్రభుత్వం గిట్టుబాటు ధరతో మినుములు, పెసల కొనుగోళ్లను మార్కెటింగ్ యార్డుల ద్వారా జరుపుతుందని పొన్నూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ నన్నపనేని ప్రభాకరరావు మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. యార్డు ద్వారా మార్చిలోగా 700 టన్నుల మినుములు కొనుగోలుచేయడం గమనించిన ప్రభుత్వం ఈ యార్డు ద్వారా పొన్నూరు, చుండూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, చేబ్రోలు, గుంటూరు రూరల్ మండలాల్లో ఉత్పతె్తైన 1500 టన్నుల మినుములు, పెసల కొనుగోలుకు ఆదేశాలు జారీచేసిందన్నారు. దీంతో గత నాలుగు రోజుల్లో 5 వేల క్వింటాళ్ల మినుములు యార్డు ద్వారా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. బయట మార్కెట్‌లో క్వింటా మినుముల ధర 4,300 రూపాయలు ఉండగా, యార్డు ద్వారా 5,400 రూపాయల ధరతో కొనుగోలు చేస్తున్నామని, ప్రతి రైతు వద్ద నుండి 25 క్వింటాళ్ల మేరకు కొనుగోలు చేస్తుండటంతో రైతుకు 34 వేల రూపాయల వరకు అధిక రాబడి లభిస్తుందని వెల్లడించారు. ఎలాంటి వివక్షకు తావులేకుండా రైతుల నుండి మినుములు కొనుగోలు చేస్తుంటే పార్టీ పరమైన వివక్ష చూపుతూ అన్యాయం చేస్తున్నారని గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ రావి వెంకటరమణ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు తమపై ఫిర్యాదు చేయడాన్ని ఆయన గర్హించారు. ఇలాంటి దిగజారుడు విమర్శలకు స్వస్తిపలకాలని హితవుపలికారు. విలేఖర్ల సమావేశంలో యార్డు మాజీ చైర్మన్ మాదల వెంకటేశ్వర్లు, డైరెక్టర్ సీతారామయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సజ్జా హేమలత, వైస్ చైర్మన్ ఆకుల సాంబశివరావు, పట్టణ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అహ్మద్ ఖాన్, బొర్రు రామారావు, లక్ష్మీనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.