గుంటూరు

మత్స్యకారులకు చేయూతనిస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్లూరు, మే 22: రాష్ట్రంలోని మత్స్యకారులకు ఆర్థిక చేయూతనందించేందుకు రాష్ట్రప్రభుత్వం విశేష కృషి చేస్తుందని తాడికొండ యార్డు చైర్మన్ బెల్లంకొండ నరసింహారావు అన్నారు. వెంకటపాలెం పుష్కరఘాట్ వద్ద మత్స్యశాఖ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి కృష్ణానదిలోకి చేప పిల్లలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు మాట్లాడుతూ జిల్లాలోని లైసెన్సుడ్ రిజర్వాయర్లైన నాగార్జున సాగర్ వద్ద 49 లక్షలు, పులిచింతల ప్రాజెక్టు వద్ద 13 లక్షలు, ప్రకాశం బ్యారేజీ వద్ద 14.6 లక్షల చేపపిల్లలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నడకుదురు శివయ్య మాట్లాడుతూ మత్స్యకారులకు సైకిళ్లు, వలలు, ఐస్ బాక్సులు పడవలు, సబ్సిడీపై అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వెంకటపాలెం సర్పంచ్ శేకూరి రవి, ఎంపీటీసీ సభ్యులు, ప్రత్తిపాటి నాగమల్లేశ్వరరావు, మత్స్యశాఖ అధికారులు, బాలకృష్ణ, ఎండి జైనుల్లాఖాన్, శ్రీనివాసలింగం తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర పోటీల్లో జిల్లా బాక్సర్ల ప్రతిభ
గుంటూరు (స్పోర్ట్స్), మే 22: విశాఖపట్నంలో ఇటీవల జరిగిన రాష్ట్ర సీనియర్ మహిళల, పురుషుల, సబ్ జూనియర్ బాల బాలికల బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పలు పతకాలను కైవసం చేసుకుని విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం బాక్సింగ్ సంఘ కార్యాలయంలో జరిగిన అభినందన సభలో సంఘ కార్యదర్శి కొసనా వేణుగోపాలరావు క్రీడాకారులను అభినందించి, క్రీడా దుస్తులను, జ్ఞాపికలను అందజేశారు. రాష్ట్ర పోటీల్లో ఎ లక్ష్మీప్రియ, ఎం సాయి తేజస్విని, పి బేబిసింధు బంగారు పతకాలను, ఎం కృష్ణమూర్తి నాయక్, టి కల్యాణ్ వెండి పతకాలను, సిహెచ్ భార్గవ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. విజేతలను జిల్లా బాక్సింగ్ సంఘ కార్యవర్గ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు అభినందించారు.