గుంటూరు

భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 22: విజయవాడ నుండి తమిళనాడు వరకు హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ చేపట్టనున్న పైపులైన్ల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ మండల తహశీల్దార్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పైపులైన్ల నిర్మాణానికి అవసరమయ్యే భూ సేకరణ ప్రక్రియకు సంబంధించి అచ్చంపేట, ఈపూరు, రొంపిచర్ల, వినుకొండ మండల తహశీల్దార్లు, హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీ ప్రతినిధులు, భూమి యజమానులతో సమీక్షించారు. హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ చేపట్టిన పైపులైన్ల నిర్మాణాలకు అవసరమయ్యే భూమిని సంబంధిత కంపెనీ నేరుగా కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందని, భూమిని అమ్మదలచుకున్న యజమానులు ముందుకు వస్తే సంబంధిత కంపెనీ కొనుగోలు చేస్తుందన్నారు. ఈ ప్రక్రియలో త్వరితగతిన పూర్తయ్యేందుకు ఆయా మండలాల తహశీల్దార్‌లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న గృహనిర్మాణ పథకాలకు సంబంధించి చేపట్టిన భూ సమీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నాలుగు మండల తహశీల్దార్లను జెసి ఆదేశించారు. ఈ సమావేశంలో హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీ ప్రతినిధులు, అచ్చంపేట, ఈపూరు, రొంపిచర్ల, వినుకొండ మండల తహశీల్దార్‌లు, భూమి యజమానులు పాల్గొన్నారు.

సాగర్ క్రష్ట్‌గేట్లకు రిమోట్‌తో ఆన్ అండ్ ఆఫ్
విజయపురిసౌత్, మే 22: ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో నాగార్జునసాగర్ క్రస్ట్‌గేట్లకు రిమోట్ సిస్టంతో ఆన్ అండ్ ఆఫ్ చేసే విధానాన్ని నూతనంగా ఏర్పాటు చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం 26 క్రస్ట్‌గేట్లకు, రెండు సూట్‌గేట్లకు కుడి, ఎడమ కాలువల గేట్లకు రిమోట్ సిస్టంను అమర్చుతున్నారు. కంట్రోల్ రూమ్ నుంచే రిమోట్ విధానంతో గేట్లను ఎత్తటం, దించటం సాధ్యపడుతుంది. రూ 7 కోట్లతో ఈ పనులను ఏర్పాటు చేస్తున్నారు. గత నెల మొదటి వారంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. జూన్ నెలాఖరుకు ఈ పనులు పూర్తి కానున్నట్లు సాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ డ్యాం నుంచి నీటి విడుదలకు సంబంధించిన సమాచారం ఇక నుంచి అధికారులు కంట్రోల్ రూమ్ నుంచే తెలుసుకోవచ్చు.

జిల్లా మహానాడును విజయవంతం చేయాలి
* ఏర్పాట్లను పరిశీలించిన దేశం నేతలు
గుంటూరు (కొత్తపేట), మే 22: తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జిల్లా మహానాడు విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసి కృషి చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈనెల 25వ తేదీన జిల్లా మహానాడు నిర్వహించనున్న నగరంలోని శ్రీ వెంకటేశ్వరా విజ్ఞాన మందిర ప్రాంగణాన్ని మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ తెలుగు తమ్ముళ్లకు మహానాడు ఒక పండుగ లాంటిదన్నారు. ఈ మహానాడులో ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ విధి విధానాలు, కార్యాచరణ, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రజల్లో నిర్వహించాల్సిన ప్రచారం, రాష్ట్రానికి ప్రత్యేక హోదాకై చేయాల్సిన ఉద్యమ కార్యాచరణ తదితర అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ విభాగాలకు సంబంధించిన చైర్మన్‌లు, ప్రతినిధులు, హాజరు కానున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మద్దాళి గిరిధర్, నాయకులు షేక్ షౌకత్, సుఖవాసి శ్రీనివాసరావు, షేక్ లాల్‌వజీర్, చిట్టాబత్తిన చిట్టిబాబు, కంచర్ల శివరామయ్య, మన్నవ కోటేశ్వరరావు, సత్యం, గడ్డిపాటి రాంబాబు, జాగర్లమూడి శ్రీనివాసరావు, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.