గుంటూరు

తెనాలి @ 43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, మే 24: ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో క్రమంగా పెరుతున్న ఉష్ణోగ్రతలను అదనుగా భావించిన కొబ్బరి బోండాల వ్యాపారులు 600 ఎంఎల్ బోండా నీరు లీటర్ బాటిల్ 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. పట్టణంలోనే ఉన్న తూనికలు, కొలతల శాఖాధికారులు ఆ వైపు కూడా చూడకపోవటం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రోహిణీ కార్తె సమయంలో 40 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం మే 24వ తేదీ నాటికే 43 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో పట్టణంలో అక్కడక్కడా పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి ప్రజల దాహార్తిని తీర్చేందుకు చల్లని నీరు, మజ్జిగ అందజేస్తున్నారు. కొందరు కొబ్బరి బోండాల కోసం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. దీనిని అదనుగా భావించిన కొందరు వ్యాపారులు గతంలో లీటరు బాటిల్ 30 రూపాయలకు విక్రయించగా, ప్రస్తుత వేసవిని దృష్టిలో పెట్టుకుని 50 రూపాయలకు పెంచారు. బోండాం నీరు అందించే బాటిల్ లీటరు ఉండదని వినియోగదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖాధికారులు స్థానికంగా ఉన్నా ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో బోండాల వ్యాపారులు ఇష్టం వచ్చిన రీతిలో ధరలు అప్పటికప్పుడే నిర్ణయించి ప్రజల అవసరాలను వ్యాపారంగా మార్చుకొని మోసం చేస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల పండ్లు కూడా కేజీల చొప్పున విక్రయాలు జరుపుతూ మోసగిస్తున్నారని అన్నారు. ఆయా కాటాలలో మోసం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వినియోగదారులకు జరుగుతున్న మోసాలను అరికట్టాలని పట్టణ ప్రజలు విఙ్ఞప్తి చేస్తున్నారు.

క్రీడా పథకాల అమలుకు కృషి
* శాప్ నూతన చైర్మన్ అంకమ్మచౌదరి
గుంటూరు (స్పోర్ట్స్), మే 24: రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధి చేయడానికి, క్రీడా పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని శాప్ నూతన చైర్మన్ అంకమ్మచౌదరి తెలిపారు. గురువారం బిఆర్ స్టేడియం, శాప్ కార్యాలయాలను సందర్శించే నిమిత్తం గుంటూరు విచ్చేసిన అంకమ్మచౌదరికి శాప్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్‌వి రమణ, ఓఎస్‌డి పి రామకృష్ణ తదితరులు ఘనస్వాగతం పలికారు. అంకమ్మచౌదరి మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే క్రమంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా జరిగిన క్రీడాధికారుల సమావేశంలో వివరాలను అందజేశారు. శాప్ చైర్మన్‌తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్‌వి రమణ, ఓఎస్‌డి పి రామకృష్ణ, రాష్ట్ర క్రీడాధికారి (శిక్షకులు) సిహెచ్ దుర్గాప్రసాద్, జిల్లా డిఎస్‌ఎ ముఖ్య శిక్షకులు ఎ మహేష్‌బాబు, స్టేడియం సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన జిమ్నాస్టిక్స్ ఇండోర్ స్టేడియాన్ని, బిఆర్ స్టేడియం ప్రాంగణాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.