గుంటూరు

రాజధానిలో ఉద్యానవనాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటరు, మే 24: రాజధాని అమరావతిలో చేపడుతున్న ఉద్యానవనాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డి పార్ధసారథి అధికారులను ఆదేశించారు. శాఖమూరులో 300 ఎకరాల్లో జరుగుతున్న వివిధ రకాల ఉద్యానవన పనులను గురువారం అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. పిపిపి పద్ధతిలో ఏర్పాటవుతున్న విల్డర్‌నెస్ పార్కు, చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్కు, ఎమ్యూజ్‌మెంట్‌పార్క్, ఎకో రిసార్ట్స్, ఏడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రోజ్ గార్డెన్, క్రాఫ్ట్ బజార్‌ల అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతవరం, మల్కాపురం గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఉద్యానవనాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఏడీసీ పట్టణ ప్రణాళిక అటవీ విభాగం అధికారులు ఆమె వెంట ఉన్నారు.