గుంటూరు

కష్టపడి పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడికొండ, మే 24: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. గురువారం తాడికొండ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో మినీ మహానాడు, వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ అభినందన సభ కార్యక్రమాల జరిగాయి. ఈ కార్యక్రమానికి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తోందన్నారు. 74 లక్షల మంది సభ్యత్వం కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అని శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఉండి ఎన్ని సమస్యలున్నా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చిన్న సమస్యలున్నా కష్టపడి పనిచేయాలని మంత్రి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రూ. 40 వేల కోట్ల అవినీతి కేసులతో ప్రతి శుక్రవారం కోర్టుకు తిరిగే వ్యక్తి జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. పద్ధతి ప్రకారం రాజధాని నిర్మాణం జరుగుతుందని అన్నారు. భారీ మెజార్టీతో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ను రానున్న ఎన్నికల్లో గెలిపించాలన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి కావాలని కుల, మతాలను రెచ్చగొడుతూ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటున్నాడని అన్నారు. తెలుగుదేశం పార్టీ 36 ఏళ్ల కాలంలో 20 ఏళ్లు అధికారంలో, 16 ఏళ్లు ప్రతిపక్షంలో ప్రజలతో మమేకమై ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఇచ్చి రాష్ట్భ్రావృద్ధికి రైతులు కృషి చేస్తుంటే సైంధవుడిలా జగన్ చర్యలు ఉన్నాయన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ హైకోర్టులో కేసులు వేస్తూ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. జగన్ నోరు అదుపులో పెట్టుకుని సంస్కారం నేర్చుకుని రాజకీయాలలోకి రావాలని మంత్రి హెచ్చరించారు. మరో సంవత్సరంలో ఎన్నికలు రానున్నాయని, రాష్ట్ర ప్రజలు, టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆనందబాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్, భావితరాల కోసం తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్భ్రావృద్ధికి సహకరించకుండా చంద్రబాబుతో వైరం తెచ్చుకున్న ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోయిందని, తెలుగు ప్రజలు కర్నాటక ఎన్నికల్లో ప్రభావం చూపించారన్నారు. ఈ కార్యక్రమంలో తాడికొండ మండలం కొన్నికల్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని మంత్రి ఆనంద్‌బాబు ప్రారంభించారు. కొన్నికల్లు నుండి తాడికొండ యార్డు ప్రాంగణం వరకు భారీ ర్యాలీతో వచ్చారు. ఈ సందర్భంగా మినీ మహానాడులో పలు తీర్మానాలను తీర్మానించారు. అనంతరం తాడికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులను మంత్రులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి టీడీపీ ఇన్‌చార్జి గంజి చిరంజీవి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ జీ కోటేశ్వరరావు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ హిదాయత్, దండమూరి మనోజ్‌కుమార్, తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు. ఫిరంగిపురం ఎంపీపీలు షేక్ రిజ్వానా, వడ్లపూడి పద్మలత, షేక్ సలీమాబీ, పేరికల అన్నమ్మ, ఫిరంగిపురం, తాడికొండ మార్కెట్ యార్డు చైర్మన్లు నార్నే శ్రీనివాసరావు, గుంటుపల్లి మధుసూధనరావు, తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ శివరామకృష్ణ, ధనేకుల సుబ్బారావు, ఎం రమేష్, తేగల ప్రభాకరరావు, పాములపాటి శివనారాయణ, బెలంకొండ నరసింహరావు, అనుమోలు సత్యనారాయణ, మానుకొండ రత్తయ్య, కంచర్ల శివరామయ్య, ఎడ్డూరి హనుమంతరావు, నూతక్కి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా, రాష్ట్ర మహానాడులకు తరలిరావాలి
గుంటూరు (కొత్తపేట), మే 24: గుంటూరు నగరంలోని వెంకటేశ్వరా విజ్ఞానంలో శుక్రవారం జరిగే జిల్లా మినీ మహానాడు, ఈనెల 27న విజయవాడలో జరిగే రాష్ట్ర మహానాడుకు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు చందు సాంబశివరావు పిలుపునిచ్చారు. మహానాడుపై పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో గురువారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా చందు సాంబశివరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేపడుతున్న మహానాడు కార్యక్రమాల్లో విధి విధానాలు, కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలు తదితర కీలక అంశాలపై చర్చ జరుగుతుందని, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, మంత్రులు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలుగు యువత అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయికృష్ణ, నగర అధ్యక్షుడు యల్లావుల అశోక్, గుడిపల్లి నవీన్, తల్లపనేని నవీన్, శేషం సుబ్బారావు, సింగంశెట్టి వీరయ్య, అమానుల్లాఖాన్, దండమూడి విజయ్, శ్రీ్ధర్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

నవనిర్మాణ దీక్ష విజయవంతానికి కృషిచేయాలి
గుంటూరు, మే 24: నవనిర్మాణ దీక్షను గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు విజయవంతం చేసేందుకు సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు కృషి చేయాలని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో నవనిర్మాణ దీక్ష కార్యక్రమ నిర్వహణపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2 నుండి 8వ తేదీ వరకు చేపట్టనున్న నవనిర్మాణ దీక్ష ఉద్దేశాన్ని ప్రజల్లోకి మరింత చేరువ చేయాలన్నారు. విభజన సమయంలో జరిగిన అన్యాయాన్ని, కేంద్రం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి అనే విషయాలు ప్రజలకు అర్థమయ్యేలా కార్యక్రమం నిర్వహించాలని సీఎం తెలిపారన్నారు. 4వ నవనిర్మాణ దీక్షను విజయవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామన్నారు. దీక్ష మొదటి రోజు ప్రతిజ్ఞ చేయడం, ఆఖరిరోజున సంకల్ప దీక్ష చేయించడం జరుగుతుందన్నారు. మిగిలిన రోజుల్లో రోజుకొక అంశంపై చర్చలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జెసి ఇంతియాజ్, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్, జెడ్పీ సిఇఒ నాగార్జున సాగర్, డిఆర్‌ఒ నాగబాబు, డిఆర్‌డిఎ పిడి సాయిబాబు, డిఎస్‌ఒ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.