గుంటూరు

మహానటి ‘సావిత్రి పాత్ర చేయడం’ మహాదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), మే 26: వెండితెరపై అభినయంతో కట్టిపడేసి, విభిన్నమైన పాత్రలను అద్భుతంగా పోషించి, ఆయా పాత్రలకు జీవం పోసిన మరువలేని మహానటి జీవితంపై రూపొందించిన చిత్రంలో సావిత్రి పాత్ర చేయడం మహాదృష్టంగా భావిస్తున్నానని కథానాయిక కీర్తిసురేష్ పేర్కొన్నారు. శనివారం నగరంలో మహానటి సావిత్రి చిత్ర యూనిట్‌కు కళాదర్బార్ అమరావతి సంస్థ పక్షాన సత్కారం జరిగింది. అంతకుముందు సచివాలయంలో రాష్ట్రప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేత యూనిట్‌కు గౌరవ సత్కారం ఘనంగా జరిగింది. అనంతరం ఈ చిత్రబృందం కళాదర్బార్ సంస్థ ఆహ్వానం మేరకు గుంటూరుకు తరలివచ్చింది. ఈ సందర్భంగా నాజ్‌సెంటర్‌లోని సావిత్రి కాంస్య విగ్రహానికి యూనిట్ సభ్యులు పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రేక్షకులనుద్దేశించి కీర్తి సురేష్ మాట్లాడుతూ వెండితెరపై వెలుగులు ప్రసరింపజేసిన మహానటి సావిత్రి చిత్రంలో నటించడం గొప్ప అదృష్టమైతే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు తిలకించి ఆదరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. ముఖ్యఅతిథి, శాసనమండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ మరువలేని, మరపురాని సహజ నటీమణి సావిత్రి అని స్మరించుకున్నారు. సావిత్రి జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చిన కీర్తి సురేష్, ఈ చిత్రాన్ని నిర్మించిన స్వప్నదత్, ఇంద్రాదత్, అశ్విన్‌లను అభినందించారు. త్వరలోనే ఈ బృందాన్ని మరొక్కపర్యాయం గుంటూరుకు ఆహ్వానించి ప్రజల సమక్షంలో ఘనసత్కారం చేస్తామని మాణిక్య వరప్రసాద్ అన్నారు. కళాదర్బార్ సంస్థ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో కథనాయిక కీర్తి సురేష్, డైరెక్టర్ నాగ అశ్విన్, నిర్మాతలను మాణిక్యవరప్రసాద్, వస్తవ్య్రాపార వేత్త బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, విజయసీడ్స్ ఎండి చంద్రశేఖరరావు, బిజినేపల్లి మోహనరావు, సుధాకర్, మురళి, బాలస్వామి తదితరులు సన్మానించారు. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, నిర్వాహకులు కీర్తిసురేష్‌ను ఘనంగా సత్కరించారు. గాయనిలు వై హేమమాలిని, మునిపల్లె రమణి, జరీన, గాయకుడు శ్రీనివాస్, సావిత్రి చిత్రాల్లోని హిట్ గీతాలను ఆలపించారు.