గుంటూరు

చిన్నారులు, మహిళల రక్షణ మా బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మే 26: చిన్నారులు, మహిళల రక్షణ బాధ్యత తమదేనని అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు తెలిపారు. శనివారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు, చిన్నారులపై వేధింపులు అకృత్యాలు అధికమయ్యాయన్నారు. అకృత్యాలకు తెగబడే వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయన్నారు. మహిళల్లో అవగాహన కల్పించేందుకు పోలీసు ప్రచార రథం ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆడపిల్లలు, చిన్నారుల పట్ల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. వారు ఎక్కడికి వెళ్తుందీ, ఏమి చేస్తుందీ, ఏవరితో స్నేహం చేస్తున్నారు, సెల్‌ఫోన్ ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయాలను గమనించాలన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దిగజారడంతో పిల్లల పెంపకంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులు పట్ల తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. సెక్షన్ 100 ప్రకారం ఆత్మరక్షణ కోసం ఎదుటి వారిపై దాడిచేస్తే తప్పులేదని, సెక్షన్ 354 ప్రకారం స్ర్తి శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, అవమానపర్చినా, అనుమతి లేకుండా ఫొటో, వీడియో తీసినా ఫిర్యాదు చేయవచ్చన్నారు. 376 ప్రకారం వైద్య చికిత్స కోసం వచ్చిన మహిళను వేధిస్తే సదరు వ్యక్తికి జైలుశిక్ష ఖాయమన్నారు. 499 సెక్షన్ ప్రకారం భార్య ఉండగా మరొకరిని వివాహం చేసుకుంటే ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడుతుందన్నారు. 509 సెక్షన్ ప్రకారం మహిళలతో అవమానకరంగా మాట్లాడినా శిక్షార్హులన్నారు. సెక్షన్ 499 ప్రకారం ఫొటోలు మార్ఫింగ్ చేసి అంతర్జాలంలో పెట్టినట్లు రుజువైతే సదరు వ్యక్తికి రెండేళ్ల వరకు జైలుశిక్ష పడుతుందన్నారు.