గుంటూరు

నవనిర్మాణ దీక్షలను విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 26: రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వం జూన్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు చేపట్టనున్న నవనిర్మాణ దీక్షను జిల్లాలో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు విజయవంతం చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు సమిష్ఠిగా కృషి చేయాలని కలెక్టర్ కోన శశిధర్ కోరారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో దీక్షా కార్యక్రమ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ దీక్ష చేపడుతున్న ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో మనకు జరిగిన అన్యాయం, కేంద్రం ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరాయి అనే విషయాలను ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలన్నారు. దీక్షను విజయవంతం చేసేవరకు అన్ని స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు. 3వ తేదీ నీటిభద్రత-కరవు రహిత రాష్ట్రం, 4న ఆహార భద్రత - రైతుల సంక్షేమం, 5న సంక్షేమం - సాధికారత, 6న జన్మభూమి, విద్య, ఉపాధి, 7న వౌళిక సదుపాయాలు - మెరుగైన జీవన ప్రమాణాలు, సుపరిపాలన-అవినీతి రహిత సమాజం కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జెసి ఎఎండి ఇంతియాజ్, ఇన్‌ఛార్జి జెసి-2 ఎల్ విజయచందర్, డిఆర్‌ఒ కె నాగబాబు, జెడ్పీ సిఇఒ నాగార్జునసాగర్, ప్రణాళికశాఖ జెడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.