గుంటూరు

ప్రజల సంతోషాన్ని హరిస్తున్న ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజార్), మే 27: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత నాలుగేళ్లలో ప్రజా సంతోషాన్ని హరించాయని అవగాహన సంస్థ ఆధ్వర్యలో జరిగిన చర్చాగోష్టికి హాజరైన మేథావులు, వివిధ సంఘాల నేతలు విమర్శించారు. స్థానిక అరండల్‌పేట అవగాహన సంస్థ కార్యాలయంలో ఆదివారం ‘నాలుగేళ్ల ప్రభుత్వాల పాలనలో సంతోషంగా ఉన్నదెవరు?’ అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు ఎ హరి అధ్యక్షత వహించారు. చర్చాగోష్టిని ప్రారంభించిన జన విజ్ఞాన వేదిక రాష్టశ్రాఖ మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ 2014లో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి దేశ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారన్నారు. దేశ ప్రజలకు అచ్ఛేదిన్‌లను కానుకగా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ నిరాశ పరిచారని ఆరోపించారు. అసంబద్ధమైన రాష్ట్ర విభజనతో రాజధాని కోల్పోయి కష్టాల్లో ఉన్న అవశేష ఆంధ్రప్రదేశ్‌ను కష్టాల నుంచి గట్టెక్కిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే హామీలు తుంగలో తొక్కారన్నారు. సీనియర్ వైద్యులు సేవ కుమార్ మాట్లాడుతూ దేశంలో అవినీతిని నిర్మూలిస్తామని, విదేశాల్లో నల్లధనాన్ని వెలికితీస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి రెండుకోట్ల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్న మోదీ ఏ ఒక్కటీ అమలుచేయలేదని దుయ్యబట్టారు. ఎన్డీయే భాగస్వామి టీడీపీ విభజన హామీ ఏ ఒక్కటీ సాధించలేక పోయిందని ఎద్దేవా చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ నాయకులు సురేష్ మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మోదీ పాలన పట్ల తీవ్ర నిరాసక్తతో ఉన్నారన్నారు. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణ మన్నారు. చర్చాగోష్టిలో సీనియర్ న్యాయవాది వై కోటేశ్వరరావు, కందిమళ్ల శివప్రసాద్, పి నర్సింహులు, మొగిలి తదితరులు పాల్గొన్నారు.

సెమీ ఫెనల్స్‌కు చేరిన టెన్నీస్ పోటీలు
గుంటూరు (స్పోర్ట్స్), మే 27: ఎన్టీఆర్ టెన్నీస్ సంఘ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో ఎల్ అస్మిత, శరణ్య, లావణ్య, జ్యోత్స్నలు సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్టీఆర్ టెన్నీస్ కప్ ఐటా టాలెంట్ సిరీస్ టెన్నీస్ పోటీలలో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో అస్మిత 8-4తో శ్రీ వైష్ణవిపై, శరణ్య 8-4తో ఎన్ ప్రవళికపై, లావణ్య 8-2తో రేష్మపై, జ్యోత్స్న 8-4తో ఎన్ హనిష్మపై గెలుపొందారు. ఈ సందర్భంగా విజేతలను శాప్ ఒఎస్‌డి పి రామకృష్ణ అభినందిస్తూ రానున్న రోజుల్లో మరింత ప్రతిభ కనబరచి జిల్లాకు, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం టెన్నీస్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ఎన్ కమాల్, నల్లబోతు శ్రీనివాసరావు, సభ్యులు ఎన్‌వి రమణ, శిక్షకుడు జీవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.