గుంటూరు

అందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజెండ్ల, మే 27: కుల, మత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది, అటువంటి పాలన చూడాలంటే ఒక్క వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని నియోజకవర్గ వైకాపా కన్వీనర్ బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన సంకల్పయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా బ్రహ్మనాయుడు చేపట్టిన పాదయాత్ర 14వ రోజుకు చేరింది. రెండో రోజైన ఆదివారం ముక్కెళ్లపాడు నుండి ప్రారంభమైన పాదయాత్ర జెడ్డవారిపాలెం, కొత్తచెర్వుకొమ్ముపాలెం, పాత చెర్వుకొమ్ముపాలెం, రెడ్డికొత్తూరు వరకు సాగింది. పాదయాత్రలో బొల్లా బ్రహ్మనాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు పూల మాలలు వేసి, కర్పూర హారతులు ఇచ్చారు. బాణసంచ పేలుస్తూ ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో సమస్యలను బొల్లా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొల్లా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఒక్క మాట కూడా నిలుపుకోలేదన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. అనంతరం రెడ్డికొత్తూరులో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో వలసలు ఎక్కువగా ఉన్నాయని, వర్షాబావ పరిస్థితులు, నాగార్జునసాగర్ జలాలు విడుదల కాకపోవడం వంటి కారణాలతో ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లారన్నారు. వలసలు అరికట్టాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు టిడిపి వారికి చెందుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ బత్తుల చిన్నాబ్బాయి యాదవ్, గంధం బాలిరెడ్డి, పారా వెంకటేశ్వర్లు, చుండూరి వెంకటేశ్వర్లు, బొట్టు రెడ్డి, దండు చెన్నయ్య, కొత్త కృష్ణారెడ్డి, పులిపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు.