గుంటూరు

సోమిరెడ్డిని బర్తరఫ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 27: బ్రాహ్మణ సామాజికవర్గం, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకునిగా పనిచేసిన రమణదీక్షితులుపై అనుచిత వ్యాఖ్యలుచేసిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య డిమాండ్ చేసింది. బ్రాహ్మణులకు సోమిరెడ్డి క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్‌శర్మ మాట్లాడుతూ అడ్డదారిలో మంత్రిపదవి పొందిన సోమిరెడ్డి సీఎం చంద్రబాబు మెప్పుకోసం బ్రాహ్మణులపై నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. టీటీడీ నగలు మాయమైన విషయమై రెండు దశాబ్దాలుగా ప్రధాన అర్చకునిగా స్వామివారికి సేవలందించిన రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలకు రాష్ట్రప్రజల్లో అనుమానాలు వేళ్లూనుకున్నాయని, వాటికి జవాబు చెప్పకుండా ఎదురు దాడికి పాల్పడటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐచే విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. బ్రాహ్మణ సంఘ నాయకులు ఈచంపాటి వెంకటకృష్ణ మాచార్యులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణులు స్థానిక పోలీసుస్టేషన్లలో సోమిరెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. రమణదీక్షితులను ప్రధాన అర్చకులుగా కొనసాగించకపోతే తిరుపతిని ముట్టడిస్తామని సంఘం నాయకులు చింతపల్లి వెంకట్, వలివేటి వెంకటరమణ, హనుంతశర్మ, సతీష్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలుచేసిన మంత్రి సోమిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణ సేవా సమితి నాయకులు ఆలూరి కోటేశ్వరరావు, వెలగలేటి గంగాధర్ ఆధ్వర్యంలో స్థానిక నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రి వ్యాఖ్యలతో రాష్ట్రంలో 4.2 శాతంగా ఉన్న బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీనిపై ఆందోళన నిర్వహించక ముందే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంత్రి సోమిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.