గుంటూరు

మాదాల మృతి ప్రజా సాంస్కృతికోద్యమానికి తీరనిలోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజార్), మే 27: విప్లవ చిత్రాల నిర్మాత, దర్శకులు నటుడు మాదాల రంగారావు మృతి ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఎంజీఎం బాషా అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో మాదాల చిత్రపటానికి పూలమాలవేసి సంతాపం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టార్‌డమ్ ఉన్న రోజుల్లో అందుకు భిన్నంగా ప్రజలు, యువతను చైతన్యవంతం చేసే సినిమాలు నిర్మించారని గుర్తు చేశారు. ప్రజానాట్యమండలి రూపొందించిన అనేక పాటలు, రచనలను ప్రజలకు చేరువ చేసేందుకు సినిమా రంగంలో రంగారావు విశేషకృషి చేశారన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా ఆదర్శంగా నిలిపారన్నారు. ఒక తరం యువతకు ఆయన రోల్‌మోడల్‌గా నిలిచారని, సినీ రంగంలో అభ్యుదయ, విప్లవ, సామాజిక సినిమాల రూపకల్పనకు రంగారావు నాంది పలికి ఎందరో దర్శకులకు మార్గదర్శకమయ్యారని నివాళులర్పించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లుతున్న తరుణంలో రంగారావు లాంటి ప్రజా రచయితలు, దర్శకుల అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన మృతి ప్రజా నాట్యమండలికి తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో వృత్తిదార్ల సమన్వయ కమిటీ జిల్లా నాయకులు జెవి రాఘవులు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి సుబ్బారావు, బి ప్రసాద్, నాయకులు రాజేష్, దేవరకొండ శీను, ఆర్‌వి రాఘవయ్య, నల్లక శ్రీధర్, పార్వతి తదితరులు పాల్గొన్నారు.