గుంటూరు

మహిళలు చైతన్యదీప్తులు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కార్పొరేషన్), మే 13: మహిళలు కేవలం కుటుంబం, ఉద్యోగాలు చేయడమే కాదు ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు తమ వంతు కృషి చేయాలని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక అవగాహన సంస్థ కార్యాలయంలో మహిళా సమస్యలు - సమాజ స్పందన అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ మహిళలు తమ కుటుంబాలతోపాటు సమాజానికి సేవ చేసే కార్యక్రమాలను చేపట్టి ప్రజల హృదయాలలో చెరగని ముద్రవేయాలన్నారు. అనంతరం వివిధ రంగాల్లో రాణిస్తున్న ఎవికె సుజాత, డాక్టర్ మైలవరపు లలితకుమారిలను అవగాహన సంస్థ మహిళా విభాగం సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో మహిళా సీనియర్ సిటిజన్‌నాయకురాలు, రచయిత విజయశ్రీ, కమలాదేవి, భాగ్యలక్ష్మి, కమలకుమారి, సింగరయ్య పాల్గొన్నారు.